Breaking News

‘రానూ బొంబాయికి రాను’.. బడ్జెట్‌ 5 లక్షలు.. కలెక్షన్స్‌ ఎంతంటే?

Published on Thu, 08/28/2025 - 13:26

ఈ మధ్య తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కోపాటకి మిలియన్ల వ్యూస్‌ వస్తున్నాయి. పెళ్లి బరాత్‌ మొదలు ఏ ఈవెంట్‌కి వెళ్లిన ఈ పాటలే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన అన్ని పాటలు ఒకెత్తు.. ‘రాను బొంబాయికి రాను..’ పాట మరో ఎత్తు. ఫోక్‌ సాంగ్స్‌లో ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఈ పాటను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు ఆ పాటకు రాము రాథోడ్‌, లిఖిత వేసిన స్టెప్పులు కూడా బాగా వైరల్‌ అయ్యాయి. ఈ ఒక్క పాటతో అటు వారిద్దరు ఫేమస్‌ అయిపోయారు. అయితే ఈ పాటకు చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయంపై రకరకాల పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా డ్యాన్సర్‌ లిఖిత క్లారిటీ ఇచ్చింది.

రెండు రోజుల షూటింగ్‌.. ఖర్చు ఎంతంటే..
రాము రాథోడ్‌ అన్నతో ముందుగా రెండు పాటలు అనుకున్నాం. ‘రాను బొంబాయికి..’ రెండో పాట. ఒక్క రోజులోనే షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. ముందుగా ప్రొమో విడుదల చేశాం. అది బాగా వెళ్లింది. ఈ పాట కోసం చేసిన రీల్‌కి ఒకే రోజు మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. దీంతో మేం కొన్ని మార్పులు చేశాం. పాట బాగా వెళ్లేలా ఉందని..రెండో రోజు వేరే చోట షూట్‌ చేశాం. అలా ఈ పాట కోసం మొత్తం రెండు రోజులు కేటాయించాం. ఇది హిట్‌ అవుతుందని తెలుసు కానీ..ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తున్నారు. నా పేరు తెలియకపోయినా..‘రాను బొంబాయి రాను’ అమ్మాయి అంటూ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు.

రూ.కోటి వచ్చింది నిజమే కానీ.. 
ఈ పాటను రామ్‌ రాథోడ్‌ తన యూట్యూబ్‌ నుంచే రిలీజ్‌ చేశాడు. ఇప్పటి వరకు రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది నిజమే. అయితే రామ్‌ రాథోడ్‌ అన్నయ్య విల్లా కొన్నాడు.. బెంజ్‌ కారు కొన్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన ఏమి కొనలేదు. ఇక నా రెమ్యునరేషన్‌ విషయానికొస్తే.. రెండు రోజులకు ఎంత మాట్లాకున్నామో అంతే ఇచ్చేశాడు. భారీగా లాభం వచ్చింది కదా అని మేం ఎక్కువ అడగలేదు. ఎంత చెప్పారో అంతే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఏమైనా ఇవ్వాలా వద్దా? అనేది వాళ్ల ఇష్టం. నేను అయితే ఏమి ఆశించడం లేదు. మేం పడిన కష్టానికి గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని లిఖిత చెప్పుకొచ్చింది. 

కాగా, ఈ పాటకు రాము రాథోడ్‌ లిరిక్స్‌ అందించడమే కాకుండా ప్రభతో కలిసి చక్కగా ఆలపించాడు కూడా. శేఖర్ వైరస్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకి కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. రామ్‌ రాథోడ్‌ తన సొంత డబ్బులతో ఈ పాటను తెరకెక్కించాడు. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)