Breaking News

సమంతను మేనేజ్‌ చేయడం కష్టం.. ఆ సినిమాలో వద్దనుకున్నా కానీ.. : సుకుమార్‌

Published on Tue, 04/09/2024 - 10:09

సమంత నటన గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఎలాంటి పాత్రలోనైనా ఆమె ఒదిగిపోతుంది. యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ పాత్ర ఏదైనా..వన్స్‌ సామ్‌ చేతికి వచ్చిదంటే..ఇక అందులో వేరే హీరోయిన్‌ని ఊహించుకోలేం. సామ్‌లోని మరో కోణాన్ని బయటకు తీసిన సినిమా ఏదైనా ఉంటే అది రంగస్థలం అనే చెప్పాలి. అంతకు ముందు సమంత అలాంటి పాత్రను పోషించలేదు.

అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. రామ్‌ చరణ్‌ పాత్రతో పాటు సామ్‌ పాత్ర కూడా అందరికి గుర్తిండిపోతుంది. అయితే ఆ పాత్రకు మొదట సమంతను అనుకోలేదట దర్శకుడు సుకుమార్‌. చివరి నిమిషంలో ఆమెను తీసుకున్నాడట. కానీ షూటింగ్‌ సమయంలో సామ్‌ నటన చూసి సుక్కు ఆశ్చర్యపోయాడట. ఆ పాత్రకు సమంత తప్ప ఇంకెవరు న్యాయం చేయలేకపోయేవారని ఆయన అన్నారు.

 ఇటీవల ఓ ఇంటర్యూలో  ఆ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘రంగస్థలం సినిమాలో రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించాడు. ఆ పాత్రను ఆయనను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు. కానీ సమంత పోషించిన లక్ష్మీ పాత్రను మాత్రం ఆమె కోసం రాయలేదు. ఒక కొత్త అమ్మాయిని పెట్టుకోవాలనుకున్నాం. సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు స్టార్స్‌ అయితే నేను సెట్‌లో మేనేజ్‌  చేయలేనేమో అనుకున్నా.

కానీ సినిమా స్క్రిప్ట్‌ ప్రకారం మంచి ఆర్టిస్ట్‌, తెలుగు వచ్చిన హీరోయిన్‌ కావాలి. సమంత అయితే పల్లెటూరి అమ్మాయి పాత్రకు సరిపోతుందని భావించి ఆమెను తీసుకున్నాం. షూటింగ్‌ సమయంలో ఆమె నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రతి సీన్‌లోనూ ఆమె పలికించిన హావభావాలు అద్భుతం. నేను సినిమాలు తీసినంత కాలం సమంతతో చేస్తూనే ఉంటా’ అని సుకుమార్‌ సమంతను పొగడ్తలో ముంచేశాడు. 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)