10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
Published on Mon, 03/09/2026 - 16:17
హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు, హీరోగా చేసిన రణ్‌దీప్ హుడా శుభవార్త చెప్పేశాడు. ఇతడి భార్య లిన్ లైస్రామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈమె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలని స్వయంగా రణ్‌దీప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్)
2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్‌దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ టైంలో అయితే వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్‌గా అలరించాడు.

అసలు విషయానికొస్తే.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్‌ని మణిపురి సంప్రదాయంలో రణ్‌దీప్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇతడి వయసు 47 ఏళ్లు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత అంటే 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గత నెలలోనే లిన్‌కి సీమంతం జరిగింది. ఆ ఫొటోలని లిన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)
Tags : 1