Breaking News

బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్

Published on Mon, 04/14/2025 - 18:50

బాలీవుడ్ తీరుపై మరో హిందీ నటుడు అసంతృప్తి బయటపెట్టాడు. చాన్నాళ్లుగా హిందీలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రణ్ దీప్ హుడా(Randeep Hooda).. ఇప్పుడు సొంత ఇండస్ట్రీనే తన సరిగా పట్టించుకోలేదని అన్నాడు. తెలుగు ఇండస్ట‍్రీ నుంచి తనకు ప్రశంసలు వచ్చాయని అన్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)

2001 నుంచి ఇండస్ట్రీలో ఉన్న రణ్ దీప్ హుడా.. చాలానే హిందీ సినిమాల్లో నటించాడు. కానీ అనుకున్నంత పేరు రాలేదనే చెప్పొచ్చు. మధ్యమధ్యలో ఒకటి రెండు ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించాడు. 2020లో రిలీజైన 'ఎక్స్ ట్రాక్షన్'(Extraction Movie) అనే హాలీవుడ్ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. కానీ బాలీవుడ్ నుంచి తనకు సరైన ప్రశంసలు దక్కలేదని బాధపడుతున్నాడు.

కానీ తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు యాక్షన్ డైరెక్టర్స్ మాత్రం తాను చేసిన 'ఎక్స్ ట్రాక్షన్' సినిమా ‍గురించి మాట్లాడి, తన యాక్షన్ ని మెచ్చుకున్నారని హుడా చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ తో పోలిస్తే తనకు టాలీవుడ్ లోనే గౌరవం దక్కిందని తాజాగా ఓ చోట మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)

తాను నటుడిగా మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ అయ్యేసరికి బాలీవుడ్ లో కొందరు భయపడ్డారని, అందుకే పబ్లిక్ గా తనని ప్రశంసించలేకపోయారని హుడా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతడు విలన్ గా నటించిన లేటెస్ట్ మూవీ 'జాట్'(Jaat Movie). తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజై నాలుగు రోజులైంది. రణ్ దీప్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఏదేమైనా ఈ మధ్య కాలంలో పలువురు హిందీ నటీనటులే.. బాలీవుడ్ తీరుని ఎండగడుతూ, సొంత ఇండస్ట్రీ పరువు తీసేస్తున్నారు. అందుకే ఇ‍ప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో తెలుగు చిత్రసీమ దూసుకెళ్తోంది.

(ఇదీ చదవండి: నోరు జారిన కుర్రాడు.. నిధి అగర్వాల్ మాత్రం)

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)