రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు
Breaking News
పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్‌డేట్ వచ్చేసింది..
Published on Thu, 08/27/2026 - 11:52
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. తొలిత ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ రష్మికకు గాయం కావడంతో విడుదల తేదీని మార్చారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

రష్మికకు గాయం..
రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక చేస్తున్న యాక్షన్ సినిమా ‘మైసా’. ఇందులో గోండు తెగకు చెందిన మహిళగా రష్మిక కనిపించనుంది. ఓ పాట షూటింగ్ చేస్తుండగా ఈమెకు బలమైన గాయమైంది. దీంతో వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తు తం కోలుకోవడంతో త్వరలోనే మూవీ షూటింగ్‌లో పాల్గొనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: సన్నీ లియోన్‌పై కేసు.. కొట్టేసిన కోర్టు
Tags : 1