Breaking News

పెదకాపు హీరో మూవీ.. ఫస్ట్ లుక్ పోస్ట్‌ రిలీజ్ చేసిన రానా

Published on Mon, 01/13/2025 - 13:22

పెదకాపు మూవీ ఫేమ్‌ విరాట్‌ కర్ణ(Virat Karrna) హీరోగా నటిస్తోన్న చిత్రం 'నాగబంధం– ది సీక్రెట్‌ ట్రెజర్‌'(Nagabandham Movie). డెవిల్‌: ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్‌ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. భోగి పండుగ సందర్భంగా హీరో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) చేతుల మీదుగా విరాట్ కర్ణ పోస్టర్‌ను రివీల్ చేశారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో విరాట్ సముద్రపు యాక్షన్‌ సన్నివేశంలో మొసలితో ఫైట్‌ చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ మూవీలో రుద్ర పాత్రలో విరాట్ కర్ణ కనిపించనున్నారు.

కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ అభిషేక్‌ నామా తెలిపారు. ఈ చిత్రాన్ని ఎలక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పణలో ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్‌ పిక్చర్స్‌పై కిషోర్‌ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్‌ అవినాష్‌ కీలక పాత్రలు పోషించనున్నారు.  ఈ మూవీకి అభే సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే నాగబంధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)