Breaking News

పావుకిలో టమాట రూ.850, పుట్టగొడుగు రూ.5 లక్షలు.. రానా షాప్‌లో రేట్లు ఎక్కువే!

Published on Sun, 02/23/2025 - 20:32

చాలామంది ఇప్పుడు ఒకే ఆదాయవనరుపై ఆధారపడకుండా సైడ్‌ బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానా (Rana Daggubati) దంపతులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఫుడ్‌ స్టోర్స్‌ అనే షాప్‌ను జనవరిలో ప్రారంభించారు. ఇక్కడ కిరాణా సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు, మాంసం, దుస్తులు, షూలు, బ్యాగ్స్‌, హెల్త్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ ఇలా అన్నీ దొరుకుతాయి. అయితే అన్నీ ప్రీమియం సరుకులే ఉంటాయి. బయట ఎక్కడా దొరకని అంతర్జాతీయ ఐటంస్‌ ఈ చోట లభించడం విశేషం.

ఖరీదైన కూరగాయలు
ఈ ఫుడ్‌ స్టోరీస్‌లో స్మూతీస్‌, జ్యూస్‌, కాఫీ, చాక్లెట్స్‌, నూడుల్స్‌.. ఇలా ఎన్నో ఉన్నాయి. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి వంటి ప్రముఖులు ఉపయోగించే వాటర్‌ బాటిల్స్‌ కూడా ఉన్నాయి. విదేశాల్లో మాత్రమే దొరికే ప్రత్యేక చీజ్‌లు, డ్రై ఫ్రూట్స్‌ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఆరు కిలోల మష్రూమ్‌ ఈ ఫుడ్‌ స్టోరీస్‌లో ఉంది. దీని విలువ ఏకంగా రూ.5 లక్షలు. మామూలు పుట్టగొడుగులు 100 గ్రాముల ధర రూ.175 నుంచి వెయ్యి రూపాయలపైనే ఉంది. 

కొబ్బరి బోండా వెయ్యి రూపాయలు
కూరగాయల్ని సైతం విదేశాలనుంచి తీసుకొస్తారు. మెక్సికో, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌.. ఇలా ఎన్నో దేశాల నుంచి దిగుమతి చేస్తారు. ఉదాహరణకు నెదర్లాండ్స్‌ నుంచి తీసుకొచ్చిన టమాట ధర 200 గ్రాములకుగానూ రూ.850గా నిర్ణయించారు. ఒక గ్లాస్‌ చెరకు రసం రూ.275గా ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన కొబ్బరి బోండాం ఒక్కోటి వెయ్యి రూపాయలని తెలుస్తోంది. ఈ ధరలు చూసిన నెటిజన్లు.. రానా- మిహికా పెట్టిన షాప్‌ కేవలం ధనవంతులకేనని, సామాన్యులు ఇక్కడ ఏదీ కొనే పరిస్థితి లేదని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా!

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)