నరేశ్‌పై 'మళ్లీపెళ్లి' ఎఫెక్ట్‌

Published on Fri, 06/23/2023 - 13:29

నరేశ్‌, పవిత్ర లోకేశ్‌  ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్‌. రాజు  తెరకెక్కించిన 'మళ్లీపెళ్లి' ఇప్పటికే విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో నరేశ్‌, పవిత్ర పలు వివాదాలతో మరింత పాపులర్‌ అయ్యారు. సినిమా విడుదలను ఆపేయాలంటూ గతంలో నరేశ్‌ భార్య రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లింది. కానీ ఇదీ సినిమా మాత్రమే అని మేకర్స్‌ తెలపడంతో మూవీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

(ఇదీ చదవండి: బాలీవుడ్‌ను భయపెడుతున్న ప్రభాస్‌.. కారణాలు ఇవే) 

తాజాగా ఈ సినిమా ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికగా (నేడు జూన్‌ 24) విడుదలైంది. దీంతో సినిమా స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ ఆహాతో పాటు అమెజాన్‌కు రమ్య  నోటీసులు జారీ చేశారు. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారని నోటీసులో తెలిపారు.  రమ్య రఘుపతిని టార్గెట్‌ చేస్తూ పరువు తీయడానికే మేకర్స్‌ సినిమాను నిర్మించారని పేర్కొన్నారు. ఇలాంటి పనుల కోసం చలనచిత్రం వంటి కళారూపాన్ని ఉపయోగించుకోవడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని తెలిపారు.

(ఇదీ చదవండి: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ.. బోల్డ్‌ కామెంట్స్‌ చేసిన నటి)

ఇప్పుడున్న పరిస్థితుల్లో  OTT ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అధిక సంఖ్యలో కంటెంట్‌ను రీచ్‌ చేస్తున్నాయి. కాబట్టి చిత్రంలో రమ్యరఘుపతి పాత్ర వల్ల తను మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రమ్య తరుపున న్యాయవాది తెలిపారు.  ఈ నోటీసుల వల్ల ఆమెజాన్‌ ప్రైమ్‌లో 'మళ్లీపెళ్లి' సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపేశారు.. కానీ 'ఆహా' వారు మాత్రం ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు. తర్వాత ఆహా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)