'రామాయణ' ఫస్ట్ రివ్యూ ఇచ్చిన నిర్మాత

Published on Wed, 11/04/2026 - 19:06

మరికొన్ని గంటల్లో 'రామాయణ' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. గురువారం(నవంబర్ 05) నుంచి ప్రపంచవ్యాప్తంగా షోలు పడనున్నాయి. అయితే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు.. మూవీ చూసి తొలి రివ్యూ ఇచ్చేశారు. ఈ మేరకు ఈయన నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

'రామాయణ ఇతిహాసాన్ని సినిమాగా మన తెలుగు ప్రేక్షకులకు అందించే భాగ్యం మాకు కలగడం ఓ ఆశీర్వాదంగా భావిస్తున్నాం. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి అద్భుతంగా నటించారు. రావణుడిగా యష్ అబ్బురపరిచారు. అద్భుతమైన విజువల్స్, ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం, మనసకు హత్తుకునే కథనం.. ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించబోతున్నాయి. మనదైన చిరస్మరణీయమైన పురాణ కావ్యాన్ని ఇంతటి స్థాయిలో తెరకెక్కించిన నమిత్ జీ, నితీష్ జీకి మా హృదయపూర్వక అభినందనలు' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ప్రధాన పాత్రలు చేశారు. నితీశ్ తివారీ దర్శకుడు. నమిత మల్హోత్రా రూ.4000 కోట్లు పెట్టి నిర్మించానని చెప్పుకొన్నారు. ఇవన్నీ పక్కనబెడితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై అంచనాలు పెద్దగా లేవు. కంటెంట్ పరంగా మెప్పిస్తే మాత్రం ఈ దీపావళికి ప్రేక్షకులకు ఇది నచ్చేయొచ్చు.

(ఇదీ చదవండి: అదిరిపోయిన 'ఇట్లు అర్జున' ట్రైలర్.. తొలి సినిమాకే మూగవాడిలా)

Videos

పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు

58 ఓట్లతో YSRCP ఆధిక్యం.. తిరుపతిలో రీకౌంటింగ్ రగడ..!

కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్

పులివెందులలో బీటెక్ రవి కుట్రలు

రెండుసార్లు రీకౌంటింగ్ పెట్టినా.. YSRCP అభ్యర్థి విజయం..

నన్ను గెలిపించిన అనంతపురం ప్రజలకు మాటిస్తున్న..

అడ్డుకున్న పోలీసులు.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

నాకిచ్చిన బ్యాలెట్ నెంబర్ మూడు.. కానీ పేపర్ పై ఆ నెంబర్ లేదు..

గెలుపోటములు సహజం.. ఓటమిపై కోలగట్ల శ్రావణి రియాక్షన్

అయ్యా పోలీసువారు మొత్తం గెలిపించింది మీరే.. బూచేపల్లి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)

+5

'అక్క' మరో ప్రపంచంలో ఉంటే ఇలానే (ఫొటోలు)

+5

#బాలు-గీత ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)