Breaking News

ఆదిపురుష్‌.. నెవర్‌ బిఫోర్‌ ఫీట్‌

Published on Thu, 05/25/2023 - 10:23

ఆదిపురుష్‌ టీమ్ మరోసారి చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే సెట్ అయిన బెంచ్ మార్క్ ను మరోమెట్టు పైకి తీసుకువెళ్లేలా.. మూవీ టీమ్ రెండో పాటను విడుదల చేయబోతోంది. ఈ తరహాలో ఇప్పటి వరకూ ఇండియాలో ఏ సినిమా పాటా విడుదల కాలేదు. "రామ్ సియా రామ్" అంటూ సాగే ఈ గీతాన్ని ఈ నెల 29న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

(చదవండి: 2018 మూవీ రివ్యూ)

ఈ గీతాన్ని సంగీత ద్వయం సచేత్ - పరంపర స్వరపరచడంతో పాటు వారే పాడారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఒక సెన్సేషనల్ గా ఉండబోతోన్న ఈ పాట ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు. సినిమాలకు సంబంధించి దేశ చరిత్రలోనే ఇదో సంచలనం కాబోతోంది. 

ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్‌ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)