Breaking News

డబుల్‌ యాక్షన్‌

Published on Mon, 05/13/2024 - 05:07

హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’(2019) మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్‌లో       ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ రూపొందుతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

 ఈ నెల 15న రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రామ్‌ సరికొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ఫేస్‌ మాస్క్, పులి చారల చొక్కా, టోర్న్‌ జీన్స్ ధరించి ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్‌ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌తో కనిపించారు రామ్‌. ‘‘డబుల్‌ ఇస్మార్ట్‌’ లో డబుల్‌ యాక్షన్, డబుల్‌ మాస్, డబుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటుంది. ఈ హై–బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, సంగీతం: మణిశర్మ, కెమెరా: సామ్‌ కె. నాయుడు, జియాని జియాన్నెలి.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)