Breaking News

మరాఠీ బ్యూటీతో లవ్‌లో పడిపోయిన 'రామ్‌'.. !

Published on Mon, 04/21/2025 - 11:52

టాలీవుడ్‌ హీరో  రామ్ పోతినేని (36) పెళ్లి గురించి ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చాయి. తెలుగు పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉండటం వల్లే ఆయనపై ఇలాంటి వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో  తనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఓ హీరోయిన్‌తో రామ్‌ ప్రేమలో పడిపోయాడని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా వారు షేర్‌ చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ సమయంలో వారిద్దరూ బాగా దగ్గరయిపోయారని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashri Borse)తో రామ్‌ పోతినేని ప్రేమలో పడిపోయాడని తెలుస్తోంది. సుమారు రెండు నెలల క్రితం కూడా వారు ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఇండస్ట్రీలో వైరల్‌ అయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్‌ వచ్చింది. తాజాగా ఓ  హోటల్ గది నుంచి రామ్, భాగ్యశ్రీ వేర్వేరుగా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే, అవి ఒకే గది నుంచి తీసినవని కొందరు గుర్తించారు. ఒకేచోట ఇద్దరూ కలిసే ఉన్నారని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ఇప్పటికే ఇదీ రూట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక ఎలాగూ ఉన్నారని, ఇప్పుడు మరో కొత్త జంట వచ్చేసిందని అంటున్నారు. అయితే, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. వారిద్దరిలో ఎవరైనా రియాక్ట్‌ అయ్యే వరకు ఈ ప్రచారాన్ని ఆపడం కాస్త కష్టమే అని చెప్పవచ్చు.

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ 25 ఏళ్ల బ్యూటీ ఇప్పుడు రామ్ పోతినేనితో ఒక సినిమా(RAPO22) చేస్తుంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని సమాచారం. ఈ సినిమాతో పాటు విజయ్‌ దేవరకొండ కింగ్‌డమ్‌ చిత్రంలోనూ భాగ్యశ్రీ నటిస్తుంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)