Breaking News

రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్‌'.. ఏ ఓటీటీకి రానుందంటే?

Published on Thu, 08/15/2024 - 11:18

రామ్ పోతినేని- పూరి జగన్నాధ్‌ కాంబోలో వచ్చిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ డబుల్‌ ఇస్మార్ట్‌. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఇస్మార్ట్ శంకర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో ఈ మూవీపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్‌ అంటూ థియేటర్ల వద్ద రామ్ ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ మూవీని 2019లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు.

మొదటి నుంచే బజ్‌ ఉన్న మూవీ కావడంతో ఓటీటీ రైట్స్‌ కోసం భారీస్థాయిలో పోటీ నెలకొంది. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్‌ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దక్షిణాది భాషల్లో డిజిటల్ రైట్స్‌ను రూ.33 కోట్లకు దక్కించుకుంది. అయితే ఒప్పందం ప్రకారం థియేట్రికల్‌ రన్‌ తర్వాతే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.  అయితే ఈ మూవీ హిందీ వర్షన్‌ డీల్ ఇంకా పూర్తి కాలేదు.

కాగా.. ఈ చిత్రంలో రామ్‍కు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, షాయాజీ షిండే, బానీ జే, అలీ, గెటప్ శ్రీను, మార్కండ్ దేశ్‍పాండే, ఉత్తేజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)