Breaking News

నాలా ఎవరూ చేయకండి.. చాలా ప్రమాదం: హీరో రామ్

Published on Sun, 08/11/2024 - 12:54

సినిమాల కోసం హీరోహీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు. రిలీజ్ టైంలో ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఈ విషయాల్ని బయటపెడుతుంటారు. యంగ్ హీరో రామ్ కూడా తన ఒక్క నెలలలో 18 కిలోలు ఎలా తగ్గానో చెప్పుకొచ్చాడు. అయితే తనలా ఎవరూ ప్రయత్నించొద్దని మాత్రం హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ రామ్ ఏం చెప్పాడంటే?

(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)

''డబుల్ ఇస్మార్ట్' కోసం పూరీ జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ కిక్ ఇచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్'లానే ఇందులోనూ షర్ట్ లేకుండా క్లైమాక్స్ చేయాలనుకున్నాం. ఆ పార్ట్ అంతా నవంబరులోనే షూట్ చేయాలి. స్కంద రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే సమయముంది. దాంతో వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెలరోజులు ఉండి ఫుల్లుగా వర్కౌట్ చేసి బరువు తగ్గాను. ఇలా తక్కువ టైంలో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదం. నేను చేసినట్లు ఎవరూ ప్రయత్నించొద్దు' అని రామ్ చెప్పుకొచ్చాడు.

రామ్ కాబట్టి హెల్తీ డైట్ ఫాలో అవుతూ నెలలో 18 కిలోలు అంటే.. 86 నుంచి 68 కిలోలకు వచ్చాడు. సాధారణంగా ఇలా ఒకేసారి తగ్గితే మాత్రం శరీరంలో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదముంది. రామ్-పూరీ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. పెద్దగా బజ్ అయితే లేదు. చూడాలి ఎలాంటి ఫలితం అందుకుంటుందో?

(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)