Breaking News

పరదా కథ అద్భుతం: హీరో రామ్‌

Published on Sun, 08/10/2025 - 01:34

‘‘హిందీలో ‘లాపతా లేడీస్‌’లాంటి సినిమాలు చూసి, మనమెందుకు అలాంటి సినిమాలు చేయలేమని ఆలోచిస్తుంటాం. ఆ కోవలో ఉండే ‘పరదా’ లాంటి సినిమాలు వచ్చినప్పుడు  ప్రోత్సహించాలి. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే, నిర్మాతలకు ధైర్యం వస్తుంది’’ అని హీరో రామ్‌ అన్నారు. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా, దర్శనా రాజేంద్రన్, సంగీత, రాగ్‌ మయూర్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘పరదా’. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ మేకర్స్‌ రాజ్, డీకేల స పోర్ట్‌తో ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువతో కలిసి విజయ్‌ డొంకాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.

శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్‌ మాట్లాడుతూ– ‘‘పరదా’ స్టోరీ లైన్‌ నాకు తెలుసు. చాలా అద్భుతమైన కథ. అనుపమ నాకు మంచి ఫ్రెండ్‌. ఏ క్యారెక్టర్‌ చేసినా వంద శాతం ఎఫర్ట్‌ పెడుతుంది. ఈ సినిమాలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది’’ అన్నారు. ‘‘రామ్‌లాంటి ఫ్రెండ్‌ ఉండటం నా అదృష్టం. నేను కూడా ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ (రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్‌. ‘‘ఈ చిత్రంలో నటిగా అనుపమ కొత్త వెర్షన్‌ను చూస్తారు’’ అని పేర్కొన్నారు దర్శక–నిర్మాతలు ప్రవీణ్, విజయ్, శ్రీధర్‌.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)