Breaking News

ఆర్జీవీ థర్డ్‌ గ్రేడ్‌ అంటూ లోకేశ్‌ వ్యాఖ్యలు.. రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చిన వర్మ

Published on Fri, 08/25/2023 - 13:13

నోటికొచ్చింది మాట్లాడతా.. ఎవరినైనా తిట్టేస్తా.. హద్దూఅదుపూ లేకుండా విచ్చలవిడిగా వాగుతా.. నన్ను ఆపేవాళ్లే లేరు.. ప్రశ్నించేవాళ్లే లేరు.. అంటూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు టీడీపీ నేత నారా లోకేశ్‌! మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందనుకుంటున్నారు.. ఎప్పుడూ అడ్డగోలు ఆరోపణలు చేసే ఆయన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను విమర్శించారు.

మిమ్మల్ని కనాలనుకోలే.. మీరు పుట్టారు
'ఎవడో నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ థర్డ్‌ గ్రేడ్‌ సినిమాలు తీస్తాడు. ఆ మహానుభావుడు సినిమాలు తీసేందుకు పర్మిషన్‌... ‍ప్రజల తరపున పోరాడుతున్న లోకేశ్‌కు ఆంక్షలా..' అని పెదవి విరిచారు. దీనిపై వర్మ యూట్యూబ్‌ వేదికగా చెంప చెళ్లుమనేలా సమాధానమిచ్చాడు. 'లోకేశ్‌.. నేను థర్డ్‌ గ్రేడా? ఫిఫ్త్‌ గ్రేడా? అన్నది ముఖ్యం కాదు.. నా ప్రశ్న ఏంటంటే.. మా నాన్న ఎక్కడో చిన్న ఉద్యోగం చేసేవారు. అక్కడి నుంచి నాకు నేనుగా సినిమాల్లోకి వచ్చి డైరెక్షన్‌ చేశాను. హిట్లు తీశాను, ఫ్లాపులు, సూపర్‌ ఫ్లాపులు కూడా తీశాను. మీరేమో చంద్రబాబు నాయుడు అనే పెద్ద నాయకుడికి పుట్టారు. ఆయన మిమ్మల్నే కనాలనుకోలేదు, కానీ మీరు పుట్టారు. దాన్ని బయాలజికల్‌ యాక్సిడెంట్‌ అంటారు.

షూటింగ్‌ పర్మిషన్‌కు, మీటింగ్‌ పర్మిషన్‌కు మధ్య సంబంధమేంటి?
ఇంతవరకు మీరేం సాధించారు? నేనేం సాధించాను? అనేది పక్కపక్కనే ఓ జాబితా తయరు చేసుకుని చూసుకోండి. అయినా నేను థర్డ్‌ గ్రేడ్‌ అంటే మరి మీరేం గ్రేడో..! మీ తండ్రిని పక్కనపెట్టేస్తే మీరు అరవడం తప్పిస్తే ఏం చేశారు? అనేది నాకింతవరకు అర్థం కాలేదు. మీరు రాజకీయ నాయకులు.. మీ ర్యాలీకి ఎందుకు పర్మిషన్‌ ఇవ్వలేదో నాకు తెలియదు. ప్రతిరోజు వందల సినిమా షూటింగ్స్‌ జరుగుతాయి. నాకొక్కరికే కాదు, అందరికీ షూటింగ్‌కు అనుమతి ఇస్తారు. షూటింగ్‌ పర్మిషన్‌కు, మీటింగ్‌ పర్మిషన్‌కు మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదు. 

అభద్రతాభావంలో లోకేశ్‌!
మీరు తెలియక మాట్లాడతారా? జనాలకు తెలియదని మాట్లాడతారా? జనాలు పట్టించుకోరని మాట్లాడతారా? కొందరు ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడతారా?.. మీరు ఓ వ్యూహం ప్రకారం మాట్లాడితే నాకు ఎలాంటి సమస్యా లేదు. మీరు అబద్ధం చెప్పినా, చెప్పాలనుకున్నా అందులో ఓ ఎజెండా ఉందనుకుంటే పర్వాలేదు. అలా కాకుండా మీరు ఏదేదో మాట్లాడితే.. మీకంటూ గుర్తింపు లేదని, తండ్రికి తగ్గ కొడుకుని కాదేమోనన్న అభద్రతాభావంలో ఉన్నారనిపిస్తోంది. మీకు నిజంగా ఈ సమస్య ఉంటే సైకియాట్రిస్ట్‌కు చూపించుకుంటే మంచిది. ఇదే నేను మీకిచ్చే సలహా' అని చెప్పుకొచ్చాడు వర్మ.

చదవండి: National film awards 2023: అల్లు అర్జున్‌... ఉత్తమ నటుడు

మరి నీ సంగతేంటి లోకేషం.. ఎన్ని కేసులు పెట్టవచ్చు?

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)