టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?
Breaking News
ఆస్కార్ ఇవ్వాల్సింది 'ఆర్ఆర్ఆర్' కు కాదు.. ఆయనకే: ఆర్జీవీ ట్వీట్ వైరల్
Published on Thu, 06/15/2023 - 07:51
టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందరికంటే భిన్నమైన ఆలోచనలతో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టట్లో ఉంటున్నారు. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటో ఓ లుక్కేద్దాం.
( ఇది చదవండి: ఎంతో కష్టపడ్డా.. అయినా బాహుబలితో అంత గుర్తింపు రాలేదు)
ఇటీవల ఏపీలోని రాయలసీమలో టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే రాయలసీమలో పాదయాత్ర ముగియడంతో నేలకు నమస్కరించిన ఫోటోను లోకేశ్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఆస్కార్ అవార్డు రావాల్సింది ఆర్ఆర్ఆర్ సినిమా, రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్కు కాదు.. ఈ పురస్కారం కచ్చితంగా నారా లోకేశ్కు దక్కాల్సిందని సెటైరికల్గా ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?)
And the OSCAR goes to not #RRR , not to @ssrajamouli , not to @mmkeeravaani not to @AlwaysRamCharan , not to @tarak9999 ..IT GOES TO @naralokesh 😘😘😘😍😍😍😍 pic.twitter.com/dctyNTEAdq
— Ram Gopal Varma (@RGVzoomin) June 14, 2023
Tags : 1