Breaking News

ఆర్ఆర్‌ఆర్‌ స్క్రీనింగ్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌.. అదేంటంటే?

Published on Mon, 05/12/2025 - 15:50

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ హీరోలుగా మెప్పించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్‌ హీరోయిన్‌గా కనిపించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేసింది. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా స్క్రీనింగ్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఓకే వేదికపై మెరిశారు.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా జూనియర్ బర్త్‌ డేకు పది రోజుల ముందే చెర్రీ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ చెంపపై ముద్దు కూడా పెట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్‌ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. ఆదివారం ఆర్ఆర్‌ఆర్‌ మూవీని లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్  వేడుకలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి సందడి చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత మొదటిసారి వేదికపైకి కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, అలియా భట్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో నటించారు. 2023లో 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)