ప్రభాస్‌ పెళ్లి ఎవరితో.. రివీల్‌ చేసిన రామ్‌ చరణ్‌

Published on Sat, 01/11/2025 - 12:08

ప్రభాస్‌ (Prabhas) పెళ్లి ఎప్పుడు..?  ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరూ అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌ పెళ్లి గురించి చాలా వార్తలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. అయితే, తాజాగా డార్లింగ్‌కు కాబోయే సతీమణి వివరాలను రామ్‌ చరణ్‌ వెళ్లడించారు. బాలకృష్ణ (Balakrishna) నిర్వహించే అన్‌స్టాపబుల్‌ వేదికగా చరణ్‌(Ram Charan) ఈ విషయాలు చెప్పనట్లు తెలుస్తోంది.  ప్రభాస్‌ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్‌ రివీల్‌ చేశారని టాక్‌ ఉంది.

గేమ్‌ ఛేంజర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్‌ షోలో బాలయ్యతో పాటు చరణ్‌ పాల్గొన్నారు. ఇప్పటికే ఒక భాగం టెలికాస్ట్‌ అయింది. రెండో భాగం జనవరి 14న విడుదల  అవుతుంది. అయితే, ప్రభాస్‌ పెళ్లి గురించి చరణ్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ మరో రెండురోజుల్లో ప్రసారం కానుంది. అందులో ప్రభాస్‌ పెళ్లి విశేషాలు ఏమైనా తెలుపుతారేమో చూడాలి. ఈ వార్త బయటకు రాగానే డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

అన్‌స్టాపబుల్‌ షోలో ప్రభాస్‌కు రామ్‌ చరణ్‌ ఫోన్‌ చేసి మాట్లాడుతారు.  అదే సమయంలో బాలయ్య కూడా సరదాగా పలు విశేషాల గురించి డార్లింగ్‌తో ముచ్చటించారు. చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రభాస్‌ అక్కడ పంచుకున్నారు. ఇదే షోలో చరణ్‌ స్నేహితులు శర్వానంద్‌, విక్కీ కూడా పాల్గొన్నారు.

2025 దసరా లోపు పెళ్లి
కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి  రీసెంట్‌గా ప్రభాస్‌ పెళ్లి గురించి ప్రకటించారు. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుందని ఆమె తెలిపారు. అమ్మాయి ఎవరు..? డేట్ వంటి వివరాలు చెప్పను గానీ అంటూనే త్వరలో శుభకార్యం తప్పకుండా ఉంటుందని ఆమె అన్నారు. ఈ దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు చరణ్‌ మాటలు చూస్తుంటే డార్లింగ్‌ పెళ్లి త్వరలోనే జరగనుందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'గేమ్‌ ఛేంజర్' కలెక్షన్స్‌ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు) 

సలార్‌,కల్కి సినిమాల హిట్‌తో ఉన్న ప్రభాస్‌ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌ చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 10న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ లైనులో ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన డైరీలో ఉన్నాయి. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)