నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
మెగా హీరో గేమ్ ఛేంజర్.. స్టన్నింగ్ లుక్లో చెర్రీ!
Published on Fri, 03/15/2024 - 19:57
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్లో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీతో ఆడి పాడనుంది. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. సెట్లో రామ్ చరణ్కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. వీడియోలో ఫుల్ ఫ్రొఫెషనల్గా కనిపించారు. ఇది చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో లుక్ సూపర్బ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Vizag Lo Charan Babu 🩷👌 pic.twitter.com/haMgxuyV2C— Hari SaaHo (@HariSaaho19) March 15, 2024
#RamCharan from the shoot#GameChanger pic.twitter.com/nNdddGQLYz— Haaph Boil (@haaphboil) March 15, 2024
Tags : 1