Breaking News

రామ్‌ చరణ్‌ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న అభిమానికి..

Published on Sat, 01/18/2025 - 17:43

హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan) గొప్ప మనసు చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న అభిమానికి నేనున్నానంటూ అభయహస్తమిచ్చాడు. చరణ్‌ అభిమానిగా ఎన్నోసార్లు రక్తదానం చేసిన ఓ వ్యక్తి భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు అతడికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో అతడి భార్యను చేర్పించారు. 17 రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. రోజుకో స్పెషలిస్ట్‌ వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించేవారు.

అభిమాని భార్యకు వైద్యసాయం
ఇది చూసిన అభిమాని హాస్పిటల్‌ బిల్లు ఎంతవుతుందోనని కంగారుపడ్డాడు. కానీ చరణ్‌ దంపతులు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్‌మెంట్‌ చేయిస్తున్నారని తెలిసి ఎంతగానో సంతోషించాడు. ఈ విషయాన్ని సదరు అభిమాని అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే షోలో వెల్లడించాడు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంతో పాటు చికిత్స అనంతరం అంబులెన్స్‌ ఏర్పాటు చేసి మరీ తన భార్యను ఇంటికి క్షేమంగా పంపించాడని చెప్పుకొచ్చాడు. అలాగే షోలో చరణ్‌.. అభిమానికి రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని చెక్‌ రూపంలో అందించాడు. ఇది చూసిన నెటిజన్లు చరణ్‌ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే సీజన్‌ 4 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోంది.

చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)