Breaking News

'రామ్ చరణ్‌కు ఫోన్ చేయి అన్నా'.. వరుణ్ తేజ్ రిప్లై ఇదే! 

Published on Tue, 02/20/2024 - 15:18

మెగా హీరో వరుణ్‌తేజ్‌ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసెన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ మేకర్స్ రిలీజ్‌ చేశారు. 

తెలుగులో రామ్‌ చరణ్ చేతుల మీదుగా ఆపరేషన్ వాలెంటైన్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌తోనే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. దీంతో మెగా హీరో‌ హిట్‌ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2019 ఫిబ్రవరి 14న  పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్ర దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుమారు 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్‌ ఆధారంగా సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది.

అయితే ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న వరుణ్ తేజ్‌కు అభిమానుల నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అక్కడే ఉన్న రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌ గేమ్ ఛేంజర్‌ అప్‌డేట్‌ అడుగన్న ప్లీజ్.. అంటూ వరుణ్‌ తేజ్‌కు రిక్వెస్ట్‌ చేశారు. రామ్ చరణ్‌ అన్నకు ఫోన్ చేసి కనుక్కో అన్నా అని అడిగారు. దీనికి వరుణ్ స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే నేను కూడా రోజు అదే అడుగుతున్నా.. ఈ రోజే షూటింగ్ స్టార్ట్‌ అయిందనుకుంటా.. అక్కడి నుంచి ఈరోజే ఉదయం ఫోన్‌ చేసి మాట్లాడడం జరిగింది అంటూ ఫ్యాన్స్‌కు సమాధానమిచ్చారు. ఈ రోజును మీకు అన్ని అప్‌డేట్స్‌ వస్తాయని వరుణ్ తేజ్‌ అన్నారు. 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)