Breaking News

Game Changer: అభిమానులతో రామ్‌చరణ్‌ సెలబ్రేషన్స్‌

Published on Sat, 01/11/2025 - 21:50

రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గేమ్ చేంజ‌ర్‌’ (Game Changer Movie) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేస్తూ దూసుకెళ్తోంది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రిలీజై భారీ విజయం దిశగా అడుగులేస్తోంది. తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. సంక్రాంతి పండుగ సీజ‌న్ కావ‌టంతో రెండో రోజున కూడా వ‌సూళ్ల ప‌రంగా ఇటు సౌత్‌లోనూ.. అటు నార్త్‌లోనూ అదే స్పీడుని గేమ్ చేంజ‌ర్ కొన‌సాగించే అవకాశం ఉంది.

డ్యాన్సుల గురించి స్పెషల్‌గా చెప్పాలా!
ప్రజా నాయ‌కుడు అప్ప‌న్నగా.. స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే క‌లెక్ట‌ర్ రామ్ నంద‌న్‌గా రెండు పాత్ర‌ల్లో చ‌ర‌ణ్ చూపించిన పెర్ఫామెన్స్‌ వేరియేష‌న్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే డ్యాన్సుల విష‌యంలో మెగా ప‌వ‌ర్ జోష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కియారా అద్వానీ గ్లామ‌ర్ లుక్స్‌, అంజ‌లి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య‌, జ‌య‌రాం, సునీల్ త‌దిత‌రుల న‌ట‌న‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్ర‌తి సన్నివేశాన్ని ఎంతో గ్రాండియ‌ర్‌గా శంక‌ర్ తెర‌కెక్కించిన తీరు, దిల్‌రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్ మేకింగ్ బాగుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

అభిమానులకు రామ్‌ చరణ్‌ కృతజ్ఞతలు
రామ్ చ‌ర‌ణ్‌ను శంక‌ర్ ఎలా ప్రెజంట్ చేస్తారోన‌ని అంద‌రూ ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూశారు. అంద‌రి అంచ‌నాల‌ను అందుకుంటూ గేమ్‌ ఛేంజర్‌ క‌లెక్ష‌న్స్ సునామీని క్రియేట్ చేస్తోంది.  ఈ స‌క్సెస్‌ను చిత్ర యూనిట్ కంటే అభిమానులే ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌టం విశేషం. గేమ్ చేంజ‌ర్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ రామ్ చ‌ర‌ణ్ ఇంటికి చేరుకుని త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఫ్యాన్స్‌ను క‌లిసిన రామ్ చ‌ర‌ణ్ వారికి కృతజ్ఞ‌తలు తెలియ‌జేశారు.

చదవండి: హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)