Breaking News

‘గుడ్‌ మార్నింగ్‌..అమెరికా’ అంటున్న రామ్‌ చరణ్‌

Published on Wed, 02/22/2023 - 13:53

‘గుడ్‌మార్నింగ్‌ హైదరాబాద్‌’ అంటూ ‘శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో చిరంజీవి పాట పాడితే.. ఇప్పుడు ఆయన తనయుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘గుడ్‌ మార్నింగ్‌..అమెరికా’అంటున్నాడు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘గుడ్‌మార్నింగ్‌ అమెరికా’ అనే పాపులర్‌ టీవీ షోలో చరణ్‌ పాల్గొననున్నారు. ఈ షో అమెరికన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 11.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ షో ద్వారా  తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో పంచుకోనున్నారు. తమ అభిమాన హీరో అమెరికన్‌ పాపులర్‌ టాక్‌ షో పాల్గొనడం పట్ల మెగా ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

అమెరికాలో అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన టీవీ షోలలో  ’గుడ్ మార్నింగ్ అమెరికా’ ఒకటి. ఈ పాపులర్ షోలో గతంలో టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ర్యాన్ రెనాల్డ్స్ వంటి హాలీవుడ్ హీరోలు పాల్గొన్నారు. టాలీవుడ్‌ నుంచి పాల్గొన్న తొలి హీరోగా రామ్‌ చరణ్‌ రికార్డుకెక్కారు. గతంలో ఇడియా నుంచి ప్రియాంక చోప్రా, షారుఖ్‌ ఖాన్‌ ఈ పాపులర్ షో పాల్గొన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి