బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్
Breaking News
మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ స్పెషల్ గిఫ్ట్
Published on Fri, 06/30/2023 - 10:30
దాదాపు పదకొండు ఏళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసింది. మంగళవారం మెగా కుటుంబానికి సెంటిమెంట్.. అదేరోజు వారి ఇంట్లోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టడంతో సంబురాలు చేసుకున్నారు. దీంతో లక్ష్మీ దేవిలా వారి కుటుంబంలో సందడి తెచ్చిందని బావించారు. ఆమె రాకతో మెగా కుటుంబమే కాదు మెగా ఫ్యాన్స్ సైతం సంతోషంతో సంబురాలు చేసుకున్నారు. ఇక పాప జాతకం కూడా చాలా బాగుందని చిరంజీవి కూడా అన్నారు. పలువురు జ్యోతిష్యులు కూడా పాప జాతకం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు కూడా.
(ఇదీ చదవండి: రామ్ చరణ్-ఉపాసన కూతురి పేరు ఫైనల్ చేసేశారు)
తాజాగా మెగా ప్రిన్సెస్కు నేడు (జూన్ 30)న పేరు పెట్టబోతున్నట్లు ఉపాసన తెలిపింది. దీంతో మెగా వారసురాలి బారసాల కార్యక్రమం నేడు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్- ఉపాసన దంపతులకు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ నుంచి ఒక కానుక వచ్చిందని ప్రచారం జరుగుతుంది. బంగారంతో తయారు చేసిన ఊయలను పాప కోసం అంబానీ పంపారట. అందుకోసం కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారికంగా ఎవరూ ప్రకటన చేయలేదు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా, ఎక్కడంటే?)
Tags : 1