Breaking News

రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ టైటిల్?

Published on Fri, 03/15/2024 - 14:12

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. చాలారోజుల నుంచి అప్‌డేట్, అప్‌డేట్ అని కలవరిస్తున్న వాళ్ల కోసమా అన్నట్లు RC16 లాంచింగ్ డేట్, టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది. గతంలో ఎన్టీఆర్ కోసం అనుకున్న టైటిల్‌ని ఇప్పుడు చరణ్ మూవీ కోసం ఖరారు చేసుకున్నారనే విషయం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం)

'ఆర్ఆర్ఆర్'లో కలిసి నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ 'దేవర'.. లెక్క ప్రకారం ఏప్రిల్ 5న రావాల్సింది. కానీ అక్టోబరుకి వాయిదా వేశారు. మరోవైపు చరణ్ పుట్టినరోజున 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి అప్‌డేట్ వస్తుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలి. అలానే ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ కూడా తెగ గింజుకుంటున్నారు.

'గేమ్ ఛేంజర్' తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేయాలి. చాన్నాళ్ల క్రితమే ఇది ఖరారైనప్పటికీ అధికారికంగా మాత్రం ఈ నెల 20న ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే రోజుల 'పెద్ది' అనే టైటిల్‌తో పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే ఈ టైటిల్‌ని గతంలో ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు అనుకున్నాడని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇ‍ప్పుడు దాన్నే చరణ్ కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ టైటిల్ విషయంలో మెగా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం లేదు! కాస్త ఓల్డ్ స్టైల్లో ఉందని అంటున్నారు.

(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)