Breaking News

వారి వల్ల సినిమా అవకాశాలు కోల్పోయాను: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Published on Thu, 09/12/2024 - 10:18

టాలీవుడ్‌ నటి రకుల్ ప్రీత్ సింగ్ చిత్రపరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) గురించి మాట్లాడారు. చిత్రపరిశ్రమ ఏదైనా సరే అక్కడ నెపోటిజం అనే పదం తప్పనిసరిగా వింటూనే ఉంటాం. ఇప్పటికే దీని గురించి చాలామంది నటీనటులు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.  ఎలాంటి సినీనేపథ్యం లేకుండానే రకుల్‌ పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదట కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ఆమె టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, నెపోటిజం వల్ల చాలా సినిమా అవకాశాలు పోగొట్టుకున్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

టాలీవుడ్‌లో మెప్పించి ఆపై బాలీవుడ్‌లో కూడా భారీ సినిమాల్లో రకూల్‌ నటించారు. టాప్‌ హీరోయిన్‌గా కొనసాగిన రకూల్‌ కూడా నెపోటిజాన్ని ఎదుర్కొన్నట్లు ఇలా చెప్పుకొచ్చారు. 'చిత్రపరిశ్రమలో నెపోటిజం ఉంది. ఇదీ జరుగుతూనే ఉంటుందనేది కూడా వాస్తవం. ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సులను  కోల్పోయాను. అరే, అవకాశాలు కోల్పోయానే అనే బాధ నాలో ఉండదు. అలా అని నేను కూర్చుని ఉండిపోయే వ్యక్తిని కాదు. బహుశా ఆ సినిమాలు నా కోసం ఉద్దేశించినవి కాకపోవచ్చని ముందుకు వెళ్తాను. 

ఇదీ చదవండి: 'దేవర' రన్‌ టైమ్‌.. ఎన్టీఆర్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన రవి బస్రూర్‌

నా తండ్రి సైన్యంలో పనిచేయడంతో ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. దీంతో ఇలాంటి చిన్నవాటి గురించి నేను పెద్దగా ఆలోచించను. అవకాశాలు కోల్పవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటుంది. అలాంటప్పుడు దక్కని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఉన్న సమయాన్ని వృథా చేసుకోను. ఒక స్టార్ కిడ్‌కు  సులభంగా ఛాన్సులు వచ్చినట్లు కొత్తవారికి మాత్రం ఎట్టిపరిస్థితిల్లోనూ రావు. ఆ క్రెడిట్‌ అంతా వారి తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుంది. అని రకుల్‌ చెప్పుకొచ్చారు.

రకుల్‌ తెలుగులో చివరి సినిమా కొండపొలం. 2021లో  ఈ మూవీ విడుదలైంది. రీసెంట్‌గా భారతీయుడు2లో ఆమె కనిపించారు. ప్రస్తుతం అజయ్‌దేవగణ్‌తో  'దే దే ప్యార్‌ దే 2'లో నటిస్తున్నారు. మేరీ పట్నీ కా రీమేక్ చిత్రంతో పాటు భారతీయుడు-3 ప్రాజెక్ట్‌ ఆమె చేతిలో ఉన్నాయి.

ఇదీ చదవండి: బెంగళూరు రేవ్‌ పార్టీలో ట్విస్ట్‌.. ఛార్జ్‌షీట్‌లో నటి హేమ పేరు
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)