నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు

Published on Fri, 04/24/2026 - 16:29

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్ల క్రితం నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. రీసెంట్‌గా భార్యభర్తలిద్దరూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలు మాట్లాడారు. అయితే ఓ సందర్భంలో తన వైవాహిక బంధాన్ని జాకీ భగ్నానీ.. 'సిట్యుయేషన్‌షిప్' అనడం కాస్త వింతగా అనిపించింది. శారీరక లేదా తాత్కాలిక సంబంధం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. దీంతో ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో స్వయంగా రకుల్.. తన భర్త చెప్పిన ఉద్దేశం గురించి క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్)

ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. మేం పెళ్లి చేసుకున్నాం కానీ మా మధ్య ఉన్నది ఓ సిట్యుయేషన్‌షిప్ లాంటిది. మేం ఒకరికొకరం అంకితమయ్యాం. నేను ఆమెతో దేని గురించైనా స్వేచ్ఛగా మాట్లాడగలను. అంతెందుకు రకుల్ పక్కనే ఉన్నప్పుడు నా ఎక్స్(మాజీ ప్రేయసి) నుంచి కాల్ వచ్చినా ఏ మాత్రం ఇబ్బందిపడకుండా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతాను. నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు. అందుకే ఈ బంధంలో నాకు ఎప్పుడూ ఊపిరాడనట్లు అనిపించలేదు. తామిద్దరం చాలా ఫ్రీగా ఉంటాం అని చెప్పుకొచ్చాడు.

ఇక సిట్యుయేషన్‌షిప్ అనే పదంపై ట్రోల్స్ ఎక్కువగా వస్తుండేసరికి రకుల్.. తన ఇన్ స్టా వేదికగా స్పందించింది. ఓ గంటపాటు జరిగిన సంభాషణలోని ఒక లైన్ తీసుకుని హెడ్ లైన్‌గా మార్చడం మాకు నవ్వు తెప్పించింది. కానీ అలా చేయడం సరైంది కాదు. సందర్భం ముఖ్యం. మా మాటల్ని క్లిక్ బైట్ చేయడం కరెక్ట్ కాదు అని పేర్కొంది. సిట్యుయేషన్‌షిప్ వ్యాఖ్యని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం చెలరేగిందని.. తమ బంధాన్ని స్వేచ్ఛగా, పరస్పర నమ్మకంతో కొనసాగిస్తున్నామని చెప్పడమే రకుల్-జాకీ ఉద్దేశంలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)

Videos

మా డాడీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం..

ఏకంగా 93% పోలింగ్.. రికార్డు సృష్టించిన బెంగాల్ ఓటర్లు..

సిలబస్ లో లేని ప్రశ్నలు.. లోకేష్ మళ్లీ అదే తప్పు

జనసేన మహిళపై.. పచ్చి బూతులతో TDP నేతల దాడి

హార్ముజ్ లో రణరంగం.. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

మీకు గొడవలే కావాలనుకుంటే నేను రెడీ.. జక్కంపూడి మాస్ వార్నింగ్

మీకు సిగ్గనిపించడం లేదా? పోలీసులకు హైకోర్టు చీవాట్లు

RTC విలీనానికి ఓకే.. 11% పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం.. సమ్మె విరమణ

చేతికి మట్టి అంటకుండా.. మటాష్.. పెద్ద దస్తగిరి హత్యలో భారీ కుట్ర!

Photos

+5

హైదరాబాద్ : బంగారు కాంతుల్లో అందాల కాంత! (ఫొటోలు)

+5

భార్యతో కలిసి ప్రియదర్శి హిమాలయ ట్రిప్ (ఫొటోలు)

+5

తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)

+5

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు (ఫొటోలు)

+5

సతీమణితో శ్రీవారిని సేవలో డైరెక్టర్ బాబీ (ఫొటోలు)

+5

రెడ్ డ్రస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ (ఫొటోలు)

+5

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

గ్లామర్‌ క్వీన్‌ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌ (ఫోటోలు)

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)