Breaking News

షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు గాయాలు!

Published on Mon, 01/20/2025 - 16:10

బాలీవుడ్ మూవీ షూటింగ్‌ సెట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హీరో అర్జున్‌ కపూర్‌తో పాటు నిర్మాత జాకీ భగ్నానీ, దర్శకుడు ముదస్సర్ అజీజ్‍కు గాయాలయ్యాయి. మేరే హస్బెండ్‌కి బీవీ మూవీ షూట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఈనెల 18న జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్తా ఆలస్యంగా బయటకొచ్చింది. 

మూవీ షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో సీలింగ్‌ కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ప్రమాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు  బీఎన్ తివారీ స్పందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రదేశంలో షూటింగ్‌ను నిలిపివేశామని తెలిపారు.

బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఎవరికీ పెద్ద గాయాలు ఏమీ లేవు. కానీ అదృష్టవశాత్తూ ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో సరైన నిర్వహణ లేకపోవడంతోనే స్టూడియోలో పైకప్పు కూలిపోయింది. కాబట్టి, భద్రతా కారణాల దృష్ట్యా  షూటింగ్ ఆపేశారు. సినీ పరిశ్రమలోని సిబ్బంది ఆరోగ్యం, భద్రతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ పంపాం. భవనాలు ఏదో ఒక రోజు కూలిపోయేలా ఉన్నాయని ఫిలిం సిటీకి కూడా లేఖ రాశాం. ఈ ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారం కనిపించలేదు. చిత్ర పరిశ్రమ అంతా దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తోంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం' అన్నారాయన.

కాగా.. అర్జున్ కపూర్ గాయంతోనే  ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. మేరే హస్బెండ్ కి బీవీ ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలోకి రానుంది. నిర్మాత జాకీ భగ్నానీ గతేడాది టాలీవుడ్‌ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను  పెళ్లాడిన సంగతి తెలిసిందే.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)