నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్‌ ఏంటంటే ?

Published on Sat, 06/25/2022 - 07:28

Rakul Preet Singh Dance Video Goes Viral Jackky Bhagnani Comment: అతికొద్ది సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్​ హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్​ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన ఈ పంజాబీ భామ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇటీవలే 'రన్‌ వే 24', 'ఎటాక్‌' చిత్రాలతో బీటౌన్‌ ఆడియెన్స్‌ను పలకరించింది. ప్రస్తుతం రకుల్‌ చేతిలో థ్యాంక్‌ గాడ్, ఛత్రీవాలి, డాక్టర్‌ జీ, ఓ మై గోస్ట్‌, మిషన్‌ సిండ్రెల్లా, 31 అక్టోబర్‌ లేడీస్‌ నైట్‌ తదితర చిత్రాలు ఉన్నాయి. సినిమాలే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది రకుల్. తాజాగా తన డ్యాన్స్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. ఈ డ్యాన్స్‌ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ కాగా పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. 

అయితే తాజాగా సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్‌ వద్ద రకుల్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఇందులో భాగంగానే 'పసూరి' (Pasoori) పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ఈ సాంగ్‌ తన ఫేవరెట్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు కొడుతూ గంటలోనే సుమారు 3 లక్షలకుపైగా వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఇది చూసిన సెలబ్రిటీలు ఓ మై గాడ్, చంపేశావ్‌ బేబీ అని కామెంట్స్‌ రూపంలో పొగుడుతున్నారు. ఇక రకుల్‌ బాయ్‌ఫ్రెండ్‌, యాక్టర్‌ జాకీ భగ్నానీ డియర్‌ లవ్‌.. నాకు కూడా నేర్పించవా అని కామెంట్‌ చేశాడు. కాగా రకుల్ డ్యాన్స్‌ చేసిన 'పసూరి' సాంగ్‌ యూట్యూబ్‌లో 20 కోట్లకు పైగా వ్యూస్‌ సొంత చేసుకుని సెన్సేషనల్‌గా మారిన విషయం తెలిసిందే. 

చదవండి: జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Videos

ట్రైలర్ చూసి రామ్ చరణ్ రియాక్షన్ ఏంటంటే..

లౌడ్ పార్టీకి అడ్డొచ్చాడని.. ఇంజనీరింగ్ విద్యార్థిపై దాడి!

ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ

అమెరికాలో తెలంగాణ అమ్మాయి దారుణ హత్య

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చిన ఏకైక మగాడు

నెక్స్ట్ నువ్వే.. జాగ్రత్త! కొలంబియాకు ట్రంప్ మాస్ వార్నింగ్

పోలీసుల ఎదుటే.. వేట కొడవళ్లతో..!

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

Photos

+5

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ HD స్టిల్స్‌

+5

బ్లూ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)