Breaking News

చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!

Published on Sun, 06/23/2024 - 07:26

సినిమా  హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే కోట్ల రూపాయలే గుర్తొస్తాయి. కానీ అదే సినిమాకు పనిచేసిన చాలామందికి మాత్రం వేలల్లోనే జీతాలు ఉంటాయి. ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు హీరోయిన్ రకుల్ భర్త జాకీ భగ్నానీ. బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరిట ఇతడికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు అందులో ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని పబ్లిక్‌గా బయట పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

1986లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ఏర్పాటైంది. కూలీ నంబర్ 1, బడేమియా చోటే మియా (1998), బీవీ నంబర్ 1, ఖామోషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసింది. ఆ తర్వాత పలు మూవీస్ చేస్తున్నప్పటికీ సక్సెస్ రావడం లేదు. రీసెంట్‌గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా అనే యాక్షన్ మూవీ తీసింది. ఘోరమైన నష్టాల్ని చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పనిచేసినందుకు గానూ తమకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)

బాలీవుడ్ రూల్స్ ప్రకారం.. సినిమా పూర్తయిన 45-60 రోజుల్లో బకాయిలన్నీ చెల్లించాలి. కానీ ఇప్పటివరకు తమకు 2 నెలల జీతాలు అందలేదని.. పూజా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు పబ్లిక్‌గా చెబుతున్నారు. వైష్ణవి అనే ఉద్యోగి మాట్లాడుతూ.. తనతో పాటు పనిచేసిన 100 మందికి.. తమకు ఇవ్వాల్సిన జీతాల కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.

మరో ఉద్యోగి స్పందిస్తూ.. ఔట్ డోర్ షూటిం‍గ్స్ జరిగేటప్పుడు తమకు సరైన తిండి కూడా పెట్టరని ఆరోపించారు. 3 నెలలు పనిచేస్తే రెండు నెలల జీతం ఎగ్గొడతారని చెప్పాడు. ఇప్పుడు తాము ఈ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల మిగతా వాళ్లయినా జాగ్రత్త పడతారని అందుకే ఇలా పోస్టులు పెడుతున్నామని అన్నారు. మరి ఈ ఆరోపణలపై నిర్మాణ సంస్థ స్పందన ఏమిటనేది చూడాలి?

(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?