amp pages | Sakshi

తనను హీరో చేయమని కొట్టేవాడు, జీవచ్ఛవంలా ఉన్నాను: నటి

Published on Thu, 02/09/2023 - 11:36

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రాఖీ సావంత్‌ వ్యవహారం కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది అదిల్‌ దురానీని పెళ్లాడిన ఆమె ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కానీ అంతలోనే అతడు తనను వేధిస్తున్నాడని, అతడికి మరో అమ్మాయితో లవ్‌ ఎఫైర్‌ ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా అదిల్‌ తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో అదిల్‌పై మరోసారి ఆరోపణలు గుప్పించింది రాఖీ. 'అదిల్‌ నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. తనను హీరో చేయమని కొట్టేవాడు. తనొక పెద్ద వ్యాపారవేత్త అని, నాకు కారు, బంగ్లా గిఫ్ట్‌గా ఇచ్చానని గొప్పలు చెప్పమనేవాడు. ఒకవేళ అలా చెప్పకపోతే నన్ను పెళ్లి చేసుకోనని, నాకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించాడు. వేరే అమ్మాయిలతో బెడ్‌ షేర్‌ చేసుకుని, ఆ వీడియోలు నాకు పంపిస్తానన్నాడు. వాటిని చూసి నేను గుండెపోటుతో చావాలని కోరుకున్నాడు. అతడికి వ్యతిరేకంగా వెళ్తే ఎవరికైనా 50 వేలు ఇచ్చి నన్ను ట్రక్కుతో గుద్దిచ్చి చంపుతానన్నాడు. అదిల్‌కు ఆల్‌రెడీ పెళ్లయింది, విడాకులు కూడా అయ్యాయి. ఆ విషయం నా దగ్గర దాచిపెట్టి మోసం చేశాడు. అతడికి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయి. అటు అమ్మ చనిపోయింది, ఇటు భర్త నన్ను దారుణంగా మోసం చేశాడు. జీవచ్ఛవంలా బతికున్నాను' అని విలపించింది రాఖీ సావంత్‌.

చదవండి: లోకేశ్‌ కనకరాజ్‌తో గొడవలు.. లియో నుంచి సైడైన బ్యూటీ

Videos

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌