మరోసారి విజయం సాధించాం: బన్నీ వాసు

Published on Sat, 11/22/2025 - 01:28

‘‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమాను ప్రతి ఒక్కరూ ఓన్‌ చేసుకుంటున్నారు. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు బాగా చేరువ చేయడానికి ప్రయత్నించాం. కంటెంట్‌ను జడ్జ్‌ చేయడంలో మేమంతా మరోసారి విజయం సాధించాం’’ అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ బన్నీ వాసు. అఖిల్‌ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్‌ ఒరిజినల్స్, వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు.

వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేసిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో సాయిలు కంపాటి మాట్లాడుతూ– ‘‘మా మూవీ సక్సెస్‌ కావడంతో మాటలు రావడం లేదు’’ అని చెప్పారు. ‘‘ప్రతి ప్రేమ జంట, ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు డా.నాగేశ్వరరావు. ‘‘ఈ స్టోరీ ప్రేక్షకులకు నచ్చుతుందన్న మా నమ్మకం నిజమైంది’’ అని రాహుల్‌ మోపిదేవి పేర్కొన్నారు.

‘‘నా పదేళ్ల కష్టానికి ఈ చిత్రంతో ఫలితం    దక్కింది’’ అన్నారు అఖిల్‌ రాజ్‌. ‘‘మా మూవీ ఎమోషనల్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు’’ అని వేణు ఊడుగుల చెప్పారు. ‘‘ప్రేక్షకాదరణ, ప్రేమ ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు చేసే ఎనర్జీని అందిస్తోంది’’ అన్నారు వంశీ నందిపాటి. సురేష్‌ బొబ్బిలి, చైతన్య జొన్నలగడ్డ పాల్గొన్నారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)