Breaking News

పవన్‌కు అహం ఎక్కువ.. పూనమ్‌ కౌర్‌ టాపిక్‌పై రాజు రవితేజ కామెంట్‌

Published on Mon, 07/24/2023 - 12:57

రాజు రవితేజ అంటే టక్కున ఎవరనే సందేహం రావడం సహజం. జనసేన, పవన్‌ అభిమానులకు మాత్రం ఆయన పేరు సుపరిచయమే. రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్‌తో రాజు రవితేజ నడిచారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.   

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన జనసేనలోకి మళ్లీ వెళ్లడం వంటి విషయాలతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ జనసేనలోకి వెళ్లే ఆలోచన లేదని రాజు రవితేజ పేర్కొన్నారు. పవన్‌ కూడా రమ్మని పిలవడని చెబుతూనే మరొకరితో ఆహ్వానం పంపుతాడని చెప్పారు. తన విషయంలో కూడా ఇదే జరిగిందని తెలిపారు. పవన్‌ ఒక అహంకారి అని చెబుతూ ఆయనలో టూ మచ్‌ అహం ఉందని రాజు రవితేజ చెప్పారు. చెప్పింది చేయడం.. చేసేది చెప్పడం ఈ రెండూ పవన్‌లో లేవన్నారు.

పూనమ్‌ కౌర్‌ గొడవలో నేను లేను
పూనమ్‌ కౌర్‌- పవన్‌ వివాదం మధ్యలో ఒక మీడియేటర్‌గా ఉన్నానని తనను చాలా మంది అనుకున్నారని రాజు రవితేజ చెప్పారు. కానీ అందులో నిజం లేదని, వారిద్దరి టాపిక్‌లోకి తాను ఎంట్రీ కాలేదని ఆయన తెలిపారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో కూడా పూర్తిగా తెలియదని ఒకే ఒక్కసారి ఈ విషయంపై పవన్‌తో చర్చించానని చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన విషయం ఏంటో పవన్‌ తనకు చెప్పారని.. కానీ అది వ్యక్తిగత విషయం కాబట్టి ఇప్పుడు బహిరంగంగా చెప్పకపోవడమే మంచిదని రాజు రవితేజ దాటవేశారు. కానీ పూనమ్‌ కౌర్‌తో వ్యక్తిగతంగా తాను ఇప్పటి వరకు మాట్లడనే లేదని తనతో ఎలాంటి పరిచయం కూడా లేదని ఆయన పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ కెరియర్‌ ఇదే
ఏపీ రాజకీయాలపై రాజు రవితేజ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ఉన్న ధోరణితో వెళ్తే రాజకీయాల్లో సక్సెస్‌ అవడం కష్టం. ఎందుకంటే ఏపీ పొలిటికల్‌ రేస్‌లో పవన్‌ థర్డ్‌ రన్నర్‌. మొదటి స్థానంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారు. ఒకవేళ ఈ పొలిటికల్‌ రేసులోకి జూనియర్‌ ఎన్టీఆర్‌, ఎవరైనా వస్తే పవన్‌ నాలుగో స్థానంలో ఉంటారు. పోలింగ్‌ రోజున మీరు సెంటర్‌కు వెళ్లి చూస్తే.. ఓటు వేసేందుకు భారీగా లైన్‌ ఉంటుంది. అందులో లేడీస్‌, ఫ్యామిలీ మెంబర్స్‌, యువకులు, ముసలి వారు, పేదలు ఇలా అందరూ ఉంటారు.

కానీ ఆ లైన్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఉండరు. వాళ్లు జెండాలు పట్టుకొని బైకులలో ఎక్కడో తిరుగుతుంటారు. వాళ్లతో పవన్‌కు ఏం లాభం ఉండదు. వాళ్లతో పవన్‌ ఈగో మాత్రమే సంతృప్తి చెందుతుంది. ఇది ఆయనలో మరింత అహంకారాన్ని పెంచుతుందే కానీ వాళ్లతో రియల్‌గా వచ్చేది ఏం లేదు. రియల్‌గా ఓటేసేది ఫ్యామిలీస్‌, పేదలు మాత్రమే. వాళ్ల జీవితాలను ఎవరైతే మారుస్తారో.. ఆ నమ్మకం ఎవరైతే కలిగిస్తారో వారికే ఓట్‌ వేస్తారు. పవన్‌ స్పీచ్‌కు, రియాలిటీకి సంబంధం ఉండదు. అని రాజు రవితేజ అన్నారు.

వలంటీర్లపై పవన్‌ వ్యాఖ్యలు తప్పు
వలంటీర్లపై పవన్‌ అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని రాజు రవితేజ అన్నారు. వాళ్లు కూడా ఈ సమాజంలో భాగమే కదా.. వాళ్లు కూడా సమాజం కోసమే పని చేస్తున్నారు. వలంటీర్లను పవన్‌ ఎందుకు శత్రువులుగా భావిస్తున్నారో తెలియదు. వాళ్లపై అంత ద్వేషం ఎందుకు ఉందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పవన్‌ ఫ్యాన్స్‌లో కూడా ఇలాంటి ద్వేషమే కనిపిపిస్తుంది. వారికి నచ్చకపోతే బూతులతోనే విరుచుకుపడుతారు. పార్టీని వీడి ఇన్ని రోజులు అయినా తనపై బూతు కామెంట్లు చేస్తూనే ఉన్నారని రాజు రవితేజ పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: బేబీ రనౌత్‌ రాక కోసం వెయిటింగ్‌: కంగనా రనౌత్‌)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)