Breaking News

కోపంతో జర్నలిస్ట్‌ ఫోన్‌ లాక్కున్న కమెడియన్‌.. వీడియో వైరల్‌

Published on Sun, 11/03/2024 - 16:49

ఈ దీపావళి సినిమా వాళ్లకు బాగానే కలిసొచ్చింది. సౌత్‌లో లక్కీ భాస్కర్‌, క, అమరన్‌ సినిమాలకు హిట్‌ టాక్‌ రాగా బాలీవుడ్‌ భూల్‌ భులయ్యా 3, సింగం అగైన్‌ చిత్రాలు ఏకంగా రూ.100 కోట్లు దాటేశాయి. ఇకపోతే భూల్‌ భులయ్యా 3 సినిమాలో నటించిన రాజ్‌పాల్‌ యాదవ్‌ తాజాగా వార్తల్లో నిలిచాడు.

దీపావళి అలా జరుపుకోవద్దు!
దీపావళికి పటాసులు కాల్చవద్దని సూచిస్తూ ఆ మధ్య ఓ వీడియో షేర్‌ చేశాడు. టపాకాయలు కాల్చడం వల్ల గాలి, శబ్ధ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నాడు. అతడి కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు వీడియోను డిలీట్‌ చేశాడు. తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి క్షమాపణలు చెప్తూ మరో వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 

నటుడి క్షమాపణలు
దీపావళి పండగ సంతోషాన్ని తగ్గించాలన్నది నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి. మన జీవితాల్లో వెలుగును, ఆనందాన్ని నింపేదే దీపావళి. ఈ పండగను అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నటుడిని ఓ జర్నలిస్టు కొన్ని ప్రశ్నలడిగాడు. 

నెలన్నరకోసారి నన్ను చూస్తారు
ఈ ఇంటర్వ్యూని అతడి ఫోన్‌లోనే రికార్డ్‌ చేశాడు. ప్రస్తుతం మీ చేతిలో ఎన్ని సినిమాలున్నాయని అడగ్గా రాజ్‌పాల్‌.. ప్రతి నెలన్నరకోసారి మీరు నన్ను చూస్తూనే ఉంటారని బదులిచ్చాడు. దీపావళి పండగపై చేసిన కామెంట్ల గురించి జర్నలిస్టు ఆరా తీయగా రాజ్‌పాల్‌ అసహనం వ్యక్తం చేశాడు.

ఫోన్‌ లాక్కున్న నటుడు
వెంటనే జర్నలిస్టు చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. ఇదంతా ఫోన్‌లో రికార్డవగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్‌పాల్‌ తన ఫోన్‌ను లాక్కోవడంతోపాటు విసిరేసేందుకు ప్రయత్నించాడని సదరు జర్నలిస్టు పేర్కొన్నాడు.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)