క్రేజీ కాంబినేషన్‌.. 'అమరన్‌' దర్శకుడితో స్టార్‌ హీరో సినిమా ఫిక్స్‌

Published on Sat, 11/09/2024 - 12:15

కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టారు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నట, దర్శక, నిర్మాత ధనుష్‌. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం రాయన్‌ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నాడీ కోపం చిత్రాన్ని కొత్తవారితో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కాగా ప్రస్తుతం ఇడ్లీ కడై చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగు, తమిళం భాషల్లో ఈయన కథానాయకుడిగా నటిస్తున్న కుబేర చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. 

తాజాగా మరో కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. ఇటీవల శివకార్తికేయన్‌ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి తెరకెక్కించిన చిత్రం అమరన్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా రాజ్‌కుమార్‌ పెరియసామి ధనుష్‌ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నటుడు ధనుష్‌ 55వ చిత్రం అన్నది గమనార్హం. 

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అన్భుచెలియన్‌ సమర్పణలో గోపురం ఫిలింస్‌ పతాకంపై సుస్మిత అన్భు చెలియన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుస్మిత అన్బుచెలియన్‌ పేర్కొంటూ ధనుష్‌, దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి వంటి ప్రతిభావంతులతో చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇది వీరి కాంబినేషన్‌లో ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించే కథా చిత్రంగా ఉంటుందని ఆమె చెప్పారు.
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)