Breaking News

రజనీకాంత్‌ జైలర్‌ మూవీ సెట్‌లో కేక్‌ కటింగ్‌

Published on Sat, 06/03/2023 - 14:35

ప్రస్తుతం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో జైలర్‌ ఒకటి. అన్నాత్తే చిత్రం తరువాత రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్‌ దర్శకుడు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌, తెలుగు నటుడు సునీల్‌, వసంత్‌ రవి, నటి రమ్యకృష్ణ, తమన్న, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించారు.

అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో రజనీకాంత్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా జైలర్‌ పాత్రలో నటించారు. ఇది యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. జైలర్‌ చిత్రంలో కామెడీ సూపర్‌గా ఉంటుందని నటుడు యోగిబాబు పేర్కొన్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రజనీకాంత్‌తో సహా చిత్ర యూనిట్‌ కేక్‌ కట్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న జైలర్‌ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం కోసం సినీ వర్గాలతో పాటు, రజనీకాంత్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా నటుడు రజనీకాంత్‌ వెంటనే తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్‌ సలాం చిత్రషూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పుదుచ్చేరిలో జరుగుతోంది. ఇందులో రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటిస్తున్నారన్నది గమనార్హం.

చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యువ నటుడు మృతి
వారందరికీ నా ప్రగాఢ సానుభూతి: అల్లు అర్జున్‌

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)