Breaking News

రూ. 2 కూలీ ఇచ్చి స్నేహితుడే అవమానించాడు: రజనీకాంత్‌

Published on Mon, 08/04/2025 - 13:49

సూపర్స్టార్రజనీకాంత్జీవితాన్ని ఒక సినిమాగా తెరకెక్కిస్తే బ్లాక్బస్టర్సినిమా అని చెప్పవచ్చు. తలైవా గతం అంతా కష్టాలతోనే నిండి ఉందని అందరికీ తెలుసు.. ఎన్నో ఆటుపోట్లతో పాటు అవమానాలు భరించి నేడు ఆయన స్థానంలో ఉన్నారు. బస్ కండక్టర్గా, కార్పెంటర్ గా కూడా పనిచేశారు. రజనీకాంత్నటించిన కొత్త సినిమా 'కూలీ' విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తన గతాన్ని ఒక్కసారి గుర్తుచేసుకున్నారు. తన కుటుంబం కోసం ఒకసారి కూలీగా లగేజ్మోయాల్సి వచ్చిందని, తాను ఎదుర్కొన్న హేళనను గుర్తుచేసుకున్నారు.

సినీ పరిశ్రమకు రాకముందు తాను కూలీగా కూడా పనిచేశానని రజనీకాంత్గుర్తుచేసుకున్నారు. 'కాలేజీ రోజులు పూర్తి అయిన తర్వాత ఒకరోజు నేను రోడ్డుపై ఉండగా.. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి పిలిచాడు. తన లగేజ్ను కారు వరకు తీసుకెళ్తావా అని అడిగాడు. దీంతో నేను కూడా సరేనన్నాను. అతని మాటలు నాకు చాలా పరిచయంగా ఉన్నట్లు అనిపించింది. కొంత సమయం తర్వాత మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నట్లు అర్థం అయింది. కాలేజీ రోజుల్లో అతన్ని సరదాగా ఏడ్పించేవాడిని. అయితే, లగేజ్ను కారు వద్దకు తీసుకెళ్లిన తర్వాత అతడు రూ. 2 చేతిలో పెడుతూ ఒక మాటన్నాడు. మనం చదువుకుంటున్న రోజుల్లో నీకు చాలా అహంకారం ఉండేదన్నాడు. అంత అహంకారంతో ఎవరూ ఉండేవారు కాదన్నాడు.. ఆపై నీకు ఆరోజులు గుర్తుకున్నాయా..? అన్నాడు. దీంతో మొదటిసారి జీవితంలో ఏడ్చాను. నేను కూలీగా ఉన్నప్పుడు చాలాసార్లు ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నాను.

నేను జీవించడానికి అలాంటి చిన్న చిన్న పనులు ఎన్నో చేశాను. నేను పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి ఇదంతా చేశాను. పేదరికం అంటే ఏమిటో నాకు మాత్రమే తెలుసు.. దానిని చూడటం, వివనడం ద్వారా కాదు. అనుభవించడం ద్వారానే తెలుసుకున్నాను.' అని పేర్కొన్నారు. ఒకప్పుడు డబ్బు కష్టాల వల్ల కార్పెంటర్గా, బస్కండక్టర్గా రజనీ పనిచేశారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నిరాశల వల్ల తీవ్రంగా బాధపడ్డారు. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా రజనీ నిర్ణయించుకున్నారట, అయితే, తనకు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పెయింటింగ్ఒకటి కనిపించడం.. అందరూ అక్కడ నమస్కరించి వెళ్తుండటంతో తనలోని ఆధ్యాత్మిక మార్పుకు తొలి అడుగు అక్కడే పడిందట. దీంతో ఆయన జీవితం మలుపు తిరిగిందని రజనీ చెప్పుకొచ్చారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)