Breaking News

జైలర్-2 తెలుగు హక్కులపై భారీ చర్చ

Published on Sun, 05/03/2026 - 23:39

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమాకు తెలుగు హక్కుల ధరను రూ.60 కోట్లుగా మేకర్స్ నిర్ణయించారు. జైలర్ చిత్రం తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దాని సీక్వెల్‌కు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ విజయాన్ని బట్టి సీక్వెల్‌కు భారీ రేట్లు చెప్పడం సహజమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జైలర్‌కు ముందు, ఆ తర్వాత రజనీకాంత్‌కు తెలుగులో పెద్ద విజయాలు లేకపోవడం గమనార్హం.  

రజనీకాంత్ నటించిన 'కూలి' చిత్రం తెలుగు రైట్స్ రూ.52 కోట్లకు (జీఎస్టీతో కలిపి) అమ్ముడయ్యాయి. వేట్టయాన్ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. కానీ పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ లెక్కలన్నీ పరిశీలించి జైలర్-2కు రూ.60 కోట్ల రేటు ఫిక్స్ చేశారు. దాంతో జైలర్-2కు ఇంత మొత్తానికి బిజినెస్ జరుగుతుందా అనే చర్చ మొదలైంది.

జూన్ 12న థియేటర్లలోకి రానున్న జైలర్-2కు ముందు రామ్‌ చరణ్‌ 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే జైలర్-2కు థియేటర్లు దొరకడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల చివరి రేటు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌లో విగ్రహాల స్మగ్లింగ్ చేసే సిండికేట్‌కు ఎదురెళ్లే రిటైర్డ్  పోలీస్ ఆఫీసర్‌గా రజనీకాంత్ కనిపించనున్నారు. ఈ కథలో ఎస్‌జే సూర్య కొత్త విలన్‌గా పరిచయం కానున్నారు.  

Videos

మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

స్టాఫ్ చేతులు కట్టేసి.. సంచుల నిండ బంగారంతో పరార్..

ఇంట్లో మొగుడు.. ఫోన్లో ప్రియుడు.. కొంపముంచుతున్న డేటింగ్ యాప్‌లు..

అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?

ఒక్కటైన పాత మిత్రులు..

కరీంనగర్ జువెల్లరీ షాప్ లో దోపిడీ Live వీడియో

YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి

ఘటనకు ముందు నేను అక్కడే ఉన్న? కాల్పులపై బండి సంజయ్ రియాక్షన్

Photos

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)

+5

నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)