Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా

Published on Thu, 09/11/2025 - 07:02

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం 'కూలీ' ఓటీటీలోకి వచ్చేసింది. లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో నాగార్జున, ఆమిర్‌ ఖాన్‌, సౌబిన్‌ షాహిర్‌, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు.

నేడు అర్ధరాత్రి ( సెప్టెంబర్‌ 11) నుంచే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కూలీ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. విడుదలైన నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్‌లో చూడని వారు ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. తాజాగా  ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే హిందీ రిలీజ్‌ గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్‌ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుందని తెలుస్తోంది.

కథేంటి..?
వైజాగ్ పోర్ట్‌లో కింగ్‪‌పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్‌గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్‌పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్‌లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)