Breaking News

రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం

Published on Mon, 01/06/2025 - 06:46

అభిమానులు లేనిదే ఏ హీరో లేడులే అన్నది వాస్తవం. అందుకే ప్రముఖ నటులు అభిమానులే మా దేవుళ్లు అంటుంటారు. ఈ అభిమానం అన్నది ఎంత వ్యసనం అంటే తమ అభిమాన హీరోల చిత్రాలు విడుదలయితే చూడాలని తహ తహలాడుతుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అదేవిధంగా అభిమానులు సినిమాలు చూడటంతో సరిపెట్టుకోరు. కొందరు తమ అభిమాన నటీనటులకు గుడులు కట్టించి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఇది అభిమానానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. 

ఇక నటుడు రజినీకాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన్ను చూడటానికి అనేకమంది అభిమానులు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటారు. అలాంటి సమయంలో రజనీకాంత్‌ ఇంటి గేటు వరకు వచ్చి చెయ్యి పైకెత్తి అభివాదం చేస్తే చాలు.. వాళ్ల జన్మ ధన్యమైనట్లు ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు. కాగా అలాంటి వీరాభిమాని ఒకరు నటుడు రజనీకాంత్‌కు గుడి కట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు.. అతని పేరు కార్తీక్‌. ఇతను ఓ మాజీ సైనికుడు కావడం విశేషం. 

మధురై జిల్లా, తిరుమంగంలో అతను రజనీకాంత్‌కు గుడి కట్టించి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన రజనీకాంత్‌ తనకు గుడి కట్టించిన వీరాభిమాని కార్తీక్‌ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్‌ గార్డెన్లోని  తన ఇంటికి రప్పించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి తన ఇంటిని  చూపించి వారితో ఫొటోలు దిగి, బాబా విగ్రహాన్ని కానుకగా అందించి సంతోష పెట్టారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)