Breaking News

'జైలర్'పై నో బజ్.. వ్యాపారం కూడా అలానే!

Published on Sun, 07/16/2023 - 14:34

Rajinikanth Jailer Movie: ముత్తువేల్‌ పాండియన్‌ (రజనీకాంత్‌) ఆట మొదలెట్టారు. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. ఆయన అభిమానులకు మజానే. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కు మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన సినిమాల కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఈ మధ్య రజనీకాంత్‌ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో ఆయన స్టామినా తగ్గిందనే ప్రచారం కూడా జరుగుతోంది. 

ఇంకా చెప్పాలంటే రజనీకాంత్‌ నటిస్తున్న 'జైలర్‌' సినిమా వ్యాపారపరంగా పెద్దగా ఊపు లేదనే మాట కూడా వినిపిస్తోంది. నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, తమన్నా, రమ్యకష్ణ, యోగిబాబు, వసంత రవి లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తుండగా, సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

(ఇదీ చదవండి: బాలయ్య హీరోయిన్ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!)

షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'జైలర్‌' ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 10న  థియేటర్లలోకి రానుంది. ఇందులో రజనీకాంత్‌, ముత్తువేల్‌ పాండియన్‌ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. ఇందులో రజనీకాంత్‌ గెటప్‌, టైటిల్‌ లాంటివి రిలీజ్‌ చేసినా ఆశించిన మూమెంట్‌ రాలేదు. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రచారం అస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధం అయ్యింది. 

ఇటీవల జైలర్ నుంచి 'కావాలయ్యా' పాటను విడుదల చేశారు. ఇప్పుడు ఇది ఊపేస్తోంది. తమన్నా అందాలారబోత, అనిరుధ్‌ బీట్స్ దెబ్బకు పాట తెగ వైరల్ అయిపోయింది. ఈ వేడిలో హుకుమ్‌ టైగర్‌ కా హుకుమ్‌ అనే మరో మాస్‌ పాటను విడుదల చేయబోతున్నారు. జూలై 17న విడుదల చేయనున్నట్లు రజనీకాంత్‌ ఫొటోతో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది సృష్టించే సంచలనం కోసం రజనీకాంత్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

(ఇదీ చదవండి: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)