Breaking News

ఇంకెంతమంది మారతారో ఏంటో?

Published on Sun, 06/07/2026 - 09:32

రజనీకాంత్‌ 173వ సినిమా గురించి ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ దర్శకులు మారుతూనే ఉన్నారు. రజనీ ప్రస్తుతం నెల్సన్‌ తీస్తున్న 'జైలర్ 2'లో నటిస్తున్నారు. ఇది సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుంది. దీని తర్వాత 173వ మూవీ చేయబోతున్నారు. కమలహాసన్‌ ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నట్లు ప్రకటించి చాలా కాలమే అయింది. ఈ చిత్రానికి చాలా మంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి సుందర్‌ సి పేరును ఖరారు చేసి, పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనూహ్యంగా సదరు దర్శకుడు తప్పుకొన్నాడు.

(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)

సుందర్ తప్పుకొన్న తర్వాత 'పార్కింగ్‌' మూవీ ఫేమ్ దర్శకుడు రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. అదీ సెట్‌  కాలేదు. డాక్టర్‌, డాన్‌ చిత్రాల దర్శకుడు శిబి చక్రవర్తి చెప్పిన కథ రజనీకాంత్‌కు నచ్చడంతో ఆయన పేరు ఖరారైంది. ఈ చిత్రాన్ని కచ్చితంగా హిట్‌ చేస్తానని శిబి ఒక వేదికపై చాలా నమ్మకంగా చెప్పాడు. అలాంటిది ఆయన పేరు మారిన వారి లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు ఓ మై కడవులే, డ్రాగన్‌ చిత్రాల ఫేమ్‌ అశ్వత్ మారిముత్తు పేరు వినిపిస్తోంది. దాదాపు ఈయనే ఫిక్స్ అని అంటున్నారు.

ఇందులో దర్శకుడు మిష్కిన్‌ ఒక కీలక పాత్రను పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో ఏ విషయాన్ని యూనిట్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. కథ నచ్చే వరకు తమ అన్వేషణ కొనసాగుతుంది అని కమలహాసన్‌ ఇంతకుముందే పేర్కొన్నారు అన్నది గమనార్హం. 

(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)