Breaking News

మురళీమోహన్‌, అలీని తిట్టిన రాజేంద్రప్రసాద్‌.. అసలేం జరిగిందంటే?

Published on Wed, 06/04/2025 - 13:57

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) అంటే అందరికీ ఎనలేని గౌరవం. కానీ ఈమధ్య ఆయన తన గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అవతలివారిపై నోరు పారేసుకుంటూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. రాబిన్‌ హుడ్‌ సినిమా సమయంలో వార్నర్‌ను దొంగ నా.. అంటూ తిట్టాడు. ఇటీవల ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో మురళీమోహన్‌ను సిగ్గుందా? అన్నాడు. ఓ హీరోయిన్‌ను బాడీ షేమింగ్‌ చేశాడు. కమెడియన్‌ అలీ (Comedian Ali)ని బూతు మాట అన్నాడు. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది.

తప్పుగా మాట్లాడటమేగాక..
అలీ స్పందించి రాజేంద్రప్రసాద్‌.. కూతురు పోయిన బాధలో ఉన్నాడని, ఈ వివాదాన్ని వదిలేయమని కోరాడు. అటు రాజేంద్రప్రసాద్‌ కూడా తప్పు గ్రహించి క్షమాపణ చెప్పకపోగా తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఖర్మ అని దబాయించడం గమనార్హం. అయితే ఈ ఈవెంట్‌లో అసలేం జరిగిందన్నది ఇప్పుడు బయటకు వచ్చింది. ఈవెంట్‌ హోస్ట్‌, ఓ సీనియర్‌ జర్నలిస్టు మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ మనస్ఫూర్తిగా వచ్చారు. 

పిలవకముందే స్టేజీపైకి..
రాజేంద్రప్రసాద్‌ ఈవెంట్‌కు లేటుగా వచ్చారు. నేను ఆయన గురించి ఇంట్రో ఇచ్చాక స్టేజీపైకి రావాలి. కానీ నేను పిలవకముందే తనే స్టేజీపైకి వచ్చి మాట్లాడారు. కాస్త శృతిమించి మాట్లాడారు. ముఖ్యంగా మురళీమోహన్‌గారిని బుద్ధుందా? అనడంతో అందరూ షాకయ్యారు. అలీపైనా నోరు జారాడు. అలా మాట్లాడటాన్ని ఎవరూ సమర్థించరు. ఆ ఫంక్షన్‌ కంటే కూడా ఈయన తిట్లే వైరలవడం దురదృష్టకరం. అక్కడున్నవారి చాలామంది ముఖాలు మాడిపోయాయి. చాలామంది ఫోన్లు చేసి బాధపడ్డారు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి అయితే ఇంకేం మాట్లాడతాం.. నో కామెంట్‌ అన్నారు.

బాధను మర్చిపోయే క్రమంలో..
రాజేంద్రప్రసాద్‌.. కూతురు కోల్పోయిన బాధలో ఉన్నారు. ఆ బాధను మర్చిపోయే క్రమంలో కాస్త అదుపు తప్పి మాట్లాడుతున్నారు. నటుడిగా రాజేంద్రప్రసాద్‌ గురించి వంక పెట్టే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. అంత గొప్ప వ్యక్తి. కానీ, ఈ మధ్యకాలంలో సమతుల్యత తగ్గుతోంది. దాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.

చదవండి: బిగ్‌ బాస్‌లోకి యూట్యూబర్లు,ఇన్‌ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ...

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)