Breaking News

నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్

Published on Sat, 11/30/2024 - 15:37

రాజేంద్రప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేముంది. అప్పట్లో హీరోగా చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సహాయ పాత్రలు చేస్తూ నటికిరిటీ అనిపించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాల్ని బయటపెట్టారు. తండ్రి మాటల వల్ల ఓ దశలో చనిపోదామనుకున్న సందర్భంగా గురించి చెప్పారు.

'మా నాన్న స్కూల్ టీచర్. చాలా కఠినంగా ఉండేవారు. ఇంజినీరింగ్ చేసిన తర్వాత నేను సినిమాల్లోకి వెళ్తానని ఆయనతో చెప్పా. నీ ఇష్టానికి వెళ్తున్నావ్, అక్కడ సక్సెస్ రావొచ్చు, ఫెయిల్యూర్ రావొచ్చు. అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిలైతే మాత్రం ఇంటికి రావొద్దని అన్నారు. ఆయన మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. దీంతో మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా, గోల్డ్ మెడల్ కూడా సాధించా. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో ఇంటికెళ్లా.. ఎందుకొచ్చావ్? రావొద్దనన్నానుగా అని నాన్న కోప్పడ్డారు'

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)

'నాన్న తిట్టేసరికి చాలా బాధ అనిపించింది. దీంతో చచ్చిపోదానుకున్నా. చివరిసారిగా నా ఆత్మీయులందరిని చూడాలనిపించింది. వాళ్లని కలిసి మాట్లాడాను. చివరగా నిర్మాత పుండరీకాక్ష‍య్య గారి ఇంటికి వెళ్లాను. అక్కడ 'మేలుకొలుపు' సినిమా విషయంలో ఏదో గొడవ జరుగుతుంది. అంతలో ఆయన రూమ్ నుంచి బయటకొచ్చి నన్ను చూసి.. సరాసరి డబ్బింగ్  రూంకి తీసుకెళ్లిపోయారు. ఓ సీన్‌కి నాతో డబ్బింగ్ చెప్పించారు. అది నచ్చడంతో.. సమయానికి భలే దొరికావ్ అని అన్నారు'

'మరో సీన్‌కి డబ్బింగ్ చెప్పమని అడగ్గానే.. తిని మూడు నెలలైంది. భోజనం పెడితే డబ్బింగ్ చెబుతానన్నా. ఛాన్సులు రాకపోయేసరికి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా విషయాన్ని ఆయనకు చెప్పా. దీంతో చాలా కోప్పడ్డారు. ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారు. అలా మొదలైన నా డబ్బింగ్ ప్రయాణం.. తర్వాత చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. మద్రాసులో ఇల్లు కట్టాను. అక్కడే దర్శకుడు వంశీ పరిచయమయ్యాడు. అతడి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాను' అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)