Breaking News

ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌

Published on Sun, 04/20/2025 - 11:08

ఆ సినిమా ఆడకపోవడంతో చనిపోదామనుకున్నాను.. కానీ తర్వాత వచ్చిన లేడీస్‌ టైలర్‌ నన్ను కాపాడింది అంటూ ఎమోషనలయ్యాడు ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad). ఈయన ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం షష్టిపూర్తి. ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. నన్ను 48 ఏళ్లుగా ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ఇళయరాజా.. తన మ్యూజిక్‌తోనే రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌.. ఇలా అందర్నీ హీరోలుగా చేశారు. 

నా ఫోటోకు దండ వేసేవారు
నేను హీరోగా చేసిన తొలి మూవీ ప్రేమించు పెళ్లాడు (Preminchu Pelladu Movie) బాక్సాఫీస్‌ వద్ద ఆడలేదు. కానీ అందులోని పాటలు మాత్రం బాగా హిట్టయ్యాయి. అంతకుముందు డబ్బింగ్‌లు చెప్పేవాడిని. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు కట్టాను. తొలిసారి కథానాయకుడిగా నటించిన ప్రేమించి పెళ్లాడు ఆడకపోవడంతో చనిపోదామనుకున్నాను. తర్వాత వచ్చిన లేడీస్‌ టైలర్‌ ఆడకపోయుంటే ఈరోజు నేనిక్కడ ఉండేవాడినే కాదు. నా ఫోటోకు దండ వేసి దండం పెట్టేవారు.

కాలు ఫ్రాక్చర్‌
లాయర్‌ సుహాసిని అనే సినిమాలో డైరెక్టర్‌ వంశీ.. కొత్త విలన్‌ను తీసుకొచ్చాడు. మేమిద్దరం ఫైటింగ్‌ చేస్తుంటే కొట్టుకోండి.. కొట్టుకోండి అన్నాడు. అతడేమో నా కాలు విరగ్గొట్టాడు. కాలికి ఫ్రాక్చర్‌ అయింది. కట్టు కట్టుకుని ఇంట్లో ఉన్నాను. నేను వస్తేనే మా స్వామి (Ilayaraja) రీరికార్డింగ్‌ చేస్తానన్నారట.. ఈ పరిస్థితిలో ఎలా రావాలి? రాను అన్నాను. చిత్రయూనిట్‌ అభ్యర్థించడంతో కట్టుతోనే ప్రసాద్‌ ల్యాబ్‌కు వచ్చాను. ఇళయరాజా థియేటర్‌ బయట నిలబడి ఉన్నాడు. 

ఇళయరాజా పాదాలు నమస్కరిస్తూ.
ఆయన నన్ను చూసి.. ఏమైందిరా? అన్నాడు. వీడే ఇరగ్గొట్టాడు అని వంశీని చూపించాను. ఏరా.. నువ్వు అంత బాగా యాక్టింగ్‌ చేస్తావా? నేనిప్పుడు రీరికార్డింగ్‌ చేస్తాను.  నీ యాక్టింగా? నా రీరికార్డింగా? తేల్చుకుందాం అన్నారు. మూడు రోజులపాటు రీరికార్డింగ్‌ చేశారు. ఆ సినిమాతో నా జర్నీ ఇక్కడిదాకా వచ్చింది అంటూ రాజేంద్రప్రసాద్‌.. చివర్లో ఇళయరాజా పాదాలు నమస్కరించాడు.

చదవండి: అది తెలిసిన రోజు సంగీతం మానేస్తాను: ఇళయరాజా

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)