Breaking News

స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా

Published on Sun, 06/01/2025 - 18:18

సెలబ్రిటీలు అంటే ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కొందరు మాత్రం పదేపదే నోరు పారేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒకరు. నటుడిగా ఈయన్ని వంక పెట్టాల్సిన పనిలేదు. అన్ని రకాల భావోద్వేగాల్ని అవలీలగా పండించేస్తుంటారు. కానీ స్టేజీ ఎక్కితే మాత్రం నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే అలీపై ఓ బూతు పదాన్ని ఉపయోగించారు.

ఈ మార్చిలో 'రాబిన్ హుడ్' సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‪‌లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. వార్నర్‌ని 'దొంగ *** కొడకా' అని అన్నాడు. అప్పుడు ఆ విషయం పెద్ద రచ్చ కావడంతో తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అదే రాజేంద్ర ప్రసాద్ మరోసారి స్టేజీపై అందరి ముందు నోరు జారాడు.

(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించారు. కృష్ణారెడ్డితో కలిసి పనిచేసిన చాలామంది టాలీవుడ్ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్.. అక్కడే ఉన్న కమెడియన్ అలీపై నోరు పారేసుకున్నాడు. బయటకు చెప్పలేని ఓ బూతు పదాన్ని అతడిపై ఉపయోగించాడు.

'మీరంతా వస్తున్నారని నాకు చెప్పలేదు. రాకుంటే మిస్ అయ్యేవాడిని. ఏరా అచ్చెన్నా.. మన ఇద్దరం బయటకు వెళ్లాక నీ సంగతి చెప్తా. ఇది మా ఇద్దరికీ అలవాటే. అలీగాడు ఎక్కడున్నాడు *** *** ఇది మనకు కామన్. నేను నిన్న ఎన్టీఆర్ అవార్డ్ తీసుకోవడానికి వెళ్లాను. ఏంటి మీరు చప్పట్లు కొట్టరా? ఎన్టీఆర్ అవార్డ్ తీసుకోవడానికి వెళ్తే కొట్టరా? బ్రెయిన్ పోయిందా మీ అందరికీ.. నేను అడిగి మరీ కొట్టించుకోవడం ఏంటన్నయ్యా.. కొట్టకపోతే మీకు సిగ్గు లేనట్లే' అని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇదీ చదవండి: ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్.. ఫైనల్లీ గుడ్ న్యూస్)

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు