Breaking News

జూ.ఎన్టీఆర్‌తో గొడవ అక్కడ మొదలైంది: రాజీవ్‌ కనకాల

Published on Fri, 07/28/2023 - 16:28

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, నటుడు రాజీవ్‌ కనకాల మంచి స్నేహితులు అన్న విషయం చాలామందికి తెలుసు. అయితే స్నేహాని కంటే ముందు వీరి మధ్య కయ్యం పుట్టిందట. అదే తర్వాత స్నేహంగా మారిందట! తమ మధ్య పరిచయం ఎలా మొదలైంది? అసలు గొడవెందుకు వచ్చింది? అన్న విషయాలను తాజాగా రాజీవ్‌ కనకాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నిన్ను చూడాలని సినిమాకు జూ.ఎన్టీఆర్‌కు నన్ను డబ్బింగ్‌ చెప్పమన్నారు. ఎందుకో తనకు నా గొంతు సరిపోదని చెప్పి వెనక్కు వచ్చేశాను. దీంతో అతడే తన డబ్బింగ్‌ చెప్పుకున్నాడు.

మొదటి రోజే కామెంట్‌
స్టూడెంట్‌ నెం.1 సినిమాలో మొదటిసారి కలిశాం. తొలి రోజు మధ్యాహ్నానికే గొడవ. నామీద ఏదో కామెంట్‌ చేశాడు. నా స్నేహితుడు చంద్రశేఖర్‌ స్టైలిష్‌వి కళ్లజోడు పట్టుకొస్తే నా పాత్రకు బాగా సూటవుతుందని అరువు తీసుకున్నాను. ఆ కళ్లజోడు పెట్టుకుని యాక్ట్‌ చేస్తున్నాను. ఛా.. అవసరమా? అన్నాడు. అవును, అవసరమే అన్నాను. జక్కన్న దగ్గరికెళ్లి చెప్పాను. నామీద కామెంట్‌ చేశాడు. రేపు పొద్దున నన్ను ఏదో ఒకటి అంటే నేను కూడా తిరిగి కౌంటరిస్తాను. అటు తిరిగి, ఇటు తిరిగి నన్నే అంటారు. నేను సినిమాలో నుంచి వెళ్లిపోతాను అన్నాను. రాజమౌళి మాత్రం.. ఆయనేదో సరదాగా జోక్‌ చేశాడు, మరీ సెన్సిటివ్‌గా ఆలోచిస్తున్నావ్‌ అన్నాడు. సరేనని ఊరుకున్నాను.

అపరిచితుడిలా నటించాడు
తెల్లారి సెట్‌కు వెళ్తే ఎన్టీఆర్‌.. రాజీవ్‌గారు, నమస్కారం.. రండి సర్‌ అన్నాడు. ఇంత అపరిచితుడులా ఉన్నాడేంటి అని లైట్‌ తీసుకున్నాను. మూడో రోజు మళ్లీ ఏదో జోక్‌ చేశాడు. నాలుగో రోజు ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఈ నాలుగురోజుల్లోనే మాకు తెలియకుండా మేమిద్దరం బాగా క్లోజ్‌ అయ్యాం. ఎంతలా అంటే అప్పటిదాకా రాజీవ్‌ గారు అని పిలిచే తారక్‌ రెండో షెడ్యూల్‌కు వచ్చేసరికి ఒరేయ్‌.. రాజాగా.. రారా అని పిలిచాడు. రాజీవ్‌గారు నుంచి రారానా? అని షాకయ్యాను. మరి ఫ్రెండంటే అనరా? అన్నాడు. అలా క్లోజయ్యాం' అని చెప్పుకొచ్చాడు రాజీవ్‌ కనకాల.

చదవండి: భోళా శంకర్‌ కోసం ఒక్క రూపాయి ముట్టుకోని చిరంజీవి

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)