Breaking News

షారుక్ ఖాన్‌, దీపికా పదుకొణెకు ముందస్తు బెయిల్‌

Published on Thu, 09/11/2025 - 11:30

బాలీవుడ్‌ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), దీపికా పదుకొణెలకు రాజస్థాన్‌ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.  హ్యుందాయ్‌ కార్ల కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్న షారుక్‌, దీపికాలపై రాజస్థాన్‌కు చెందిన కీర్తిసింగ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కార్ల కంపెనీ ప్రచారం చేయడం వల్ల తాను ఒక కారు కొనుగోలు చేసి నష్టపోయానని, వారిద్దరూ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన కేసు వేశారు. అయితే, ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని రాజస్థాన్‌ హైకోర్టును నటీనటులు కూడా ఆశ్రయించారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25న ఉంటుందని పేర్కొంది.

గతంలో కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు ఇలా ఉంది. 2022 జూన్ నెలలో హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ కారును సుమారు రూ. 24 లక్షలకు కొనుగోలు చేస్తే.. కేవలం ఆరు నెలల్లోనే కారు ఇంజన్‌లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నాడు. అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్‌ నుంచి తీవ్రమైన శబ్ధం వస్తుందని ఒక్కోసారి దారి మధ్యలోనే ఆగిపోతుందని తెలిపాడు. కారు సమస్య గురించి కంపెనీ ఏజెన్సీని సంప్రదించినప్పుడు, ఇది ఈ కారు మోడల్ తయారీ లోపమంటూ దాన్ని పరిష్కరించలేమని అక్కడి సిబ్బంది చెప్పినట్లు ఆయన పేర్కొన్నాడు. నిర్లక్ష్యంతో సమాధానం చెప్పడంతో తాను కోర్టును ఆశ్రయించానని తెలిపాడు. హ్యూందాయ్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా పనిచేస్తున్న షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె( Deepika Padukone) ఈ ఘటనలో బాధ్యత వహించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)