Breaking News

ఎమోషనల్‌ రాజా

Published on Fri, 07/17/2026 - 03:34

రుత్విక్, విశాఖ ధిమాన్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజా ది రాజా’. కె. శ్రీలత రెడ్డి సమర్పణలో అనిల్‌ బోయిడపు దర్శకత్వంలో కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలఅవుతోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తోంది. గురువారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రుత్విక్‌ మాట్లాడుతూ–‘‘నిన్న (బుధవారం) జరిగిన ప్రీమియర్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన చూసి, నేను చాలా అదృష్టవంతుడిని అనిపించింది.

అలాంటి ప్రేమ, ఆదరణ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశాను. మీ అందరి ముందుకు హీరోగా రావడం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. మేము ఎంతో ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఒక కల. ఆ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. మంచి అవుట్‌పుట్‌ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ఈ సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయి’’ అన్నారు అనిల్‌.

‘‘ఈ సినిమా కోసం రుత్విక్‌ పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేను. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో కష్టపడి పని చేశారు. ప్రేక్షకులు కూడా ఇదే ప్రేమతో సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కె.నిహారిక. సంగీత దర్శకుడు మార్క్‌ కె. రాబిన్‌ మాట్లాడారు.  
 

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)